చెర్రీ, తారక్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఆర్ఆర్ఆర్ రీ రిలీజ్.. ఎప్పుడో తెలుసా!

May 6, 2024

చెర్రీ, తారక్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఆర్ఆర్ఆర్ రీ రిలీజ్.. ఎప్పుడో తెలుసా!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ముఖ్య పాత్రల్లో నటించిన భారీ చిత్రం ఆర్ఆర్ఆర్. భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా విడుదల అయ్యి దేశవ్యాప్తంగా వసూళ్ల సునామిని సృష్టించింది. కాగా ఈ సినిమా లోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఆర్ఆర్ఆర్ సినిమాపై అభిమానులు, నెటిజన్లు, ప్రముఖులు, ప్రేక్షకులు ఒక్కొక్కరు ఒక్కో రకంగా స్పందించారు. ఈ సినిమా దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా రికార్డుల మోత మోగించింది.

ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా భారీగా వసూళ్లను సాధించింది. కొన్ని ఏరియాలో ఈ సినిమా దాదాపు ఏడాది పాటు ఆడి సరికొత్త రికార్డులను కూడా సృష్టించింది. ఎన్టీఆర్ ను కొమురం భీమ్ గా రామ్ చరణ్ ను అల్లూరి సీతారామ రాజుగా నటించారు. ఇద్దరు హీరోలు అద్భుతంగా నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఎన్టీఆర్ , రామ్ చరణ్ ఒకరితో ఒకరు పోటీ పడుతూ ప్రేక్షకులను మెప్పించారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో ప్రతి సన్నివేశం సినిమాకే హైలెట్ అనే చెప్పాలి. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించాయి. ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోలు కలిసి ఫైట్ చేసే సీన్స్ కు ప్రేక్షకులు విజిల్స్ కొట్టేలా చేసింది

అలాగే ఈ సినిమాలో నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. ఓవరాల్ గా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధించడంతో పాటు భారీ కలెక్షన్స్ కూడా సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ సినిమా రీ రిలీజ్ కానుందని తెలుస్తుంది. ఆర్ఆర్ఆర్ సినిమా రీ రిలీజ్ చేయాలని ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాను బాలీవుడ్ లో రీ రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా రీ రిలీజ్ కు సంబందించిన అప్డేట్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. అయితే ఇందుకు సంబంధించి ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Read More: గీతాంజలి మళ్లీ వచ్చింది ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడు.. ఎక్కడంటే?

ట్రెండింగ్ వార్తలు