ఇండస్ట్రీలో ఉంటూ భారీగానే ఆస్తులు వెనకేసిన త్రిష!

February 9, 2024

ఇండస్ట్రీలో ఉంటూ భారీగానే ఆస్తులు వెనకేసిన త్రిష!

సౌత్ సినీ ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో త్రిష ఒకరు. ఈమె హీరోయిన్గా ఒకానొక సమయంలో రెండు రాష్ట్రాలలోనూ ఓ వెలుగు వెలిగారు అగ్ర హీరోలందరూ సరసన నటించి కోలీవుడ్ టాలీవుడ్ చిత్ర పరిశ్రమలను ఏలారు. ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగినటువంటి ఈమెకు క్రమక్రమంగా సినిమా అవకాశాలు తగ్గాయి. దీంతో లేడి ఓరియెంటెడ్ సినిమా అవకాశాలను అందుకుంటూ వరుసగా సినిమాలో చేశారు అయితే ఈ సినిమాలో పెద్దగా సక్సెస్ కాకపోవడంతో కొంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు.

ఇలా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి త్రిషకు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన పొన్నియన్ సెల్వన్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఈమె కెరియర్ ఒక్కసారిగా టర్న్ అయిందని చెప్పాలి. ఈ సినిమా సక్సెస్ కావడంతో ఈమెకు వరుసగా స్టార్ హీరోల సినిమాలలో నటించే అవకాశాలు వచ్చాయి. ఈ సినిమా తర్వాత లియో సినిమాలో నటించే సక్సెస్ అందుకున్నారు.

ప్రస్తుతం ఈమె కమల్ హాసన్, మోహన్ లాల్, అజిత్ చిరంజీవి వంటి స్టార్ హీరోల సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇక సౌత్ సినీ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఈమె సినిమా అవకాశాలను అందుకున్నారని తెలుస్తోంది. ఇక ఈమెకు ప్రస్తుతం డిమాండ్ భారీగా పెరిగిపోవడంతో ఒక్కో సినిమాకు సుమారు పది కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది.

దాదాపు 20 ఏళ్ల పాటు ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉన్నటువంటి త్రిష భారీ మొత్తంలోనే ఆస్తులను కూడా పెట్టారని తెలుస్తోంది. చెన్నైలో పాటు ఇతర నగరాలలో కూడా ఖరీదైన బంగ్లాలతో పాటు లగ్జరీ కార్లు కూడా ఈమె కొనుగోలు చేశారట అంతే కాకుండా పలు నివేదికల ప్రకారం ఈమె నికర ఆస్తులు విలువ సుమారు 100 కోట్లకు పైగా ఉంటుందని తెలుస్తోంది. ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా సక్సెస్ అయ్యి భారీ స్థాయిలో ఆస్తులు సంపాదించిన త్రిష ఇప్పటికీ సింగిల్ గా ఉండటం గమనార్హం.

Read More: మరొకసారి రెచ్చిపోయిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్.. థియేటర్ లో మంటలతో అలా?

Related News

ట్రెండింగ్ వార్తలు