హీరోయిన్ త్రిషకు ఊహించని గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేసిన చిరు.. సంతోషంలో నటి?

March 11, 2024

హీరోయిన్ త్రిషకు ఊహించని గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేసిన చిరు.. సంతోషంలో నటి?

మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ ఉన్నటువంటి ఈయన ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీ అయ్యారు. ఇలా నటుడిగా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి చిరంజీవి ప్రస్తుతం డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో సోషియో ఫాంటసీ నేపథ్యంలో రాబోతున్నటువంటి విశ్వంభర అనే సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులను జరుపుకుంటుంది.

ఇక ఈ సినిమాలో చిరంజీవి సరసన త్రిష నటించబోతున్నారు. ఇదివరకే త్రిష షూటింగ్ లొకేషన్లోకి అడుగుపెట్టడంతో చిరంజీవి ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఈ విధంగా చిరంజీవి త్రిష కాంబినేషన్లో ఈ సినిమా రాబోతుందనే విషయం తెలియడంతో ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు పెరిగిపోయాయి. వీరిద్దరి కాంబినేషన్లో సుమారు 18 సంవత్సరాల క్రితం స్టాలిన్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అప్పట్లో ఈ సినిమా ఎంతో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇలా చాలా సంవత్సరాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రావడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇదిలా ఉండగా తాజాగా మెగాస్టార్ చిరంజీవి త్రిషకు ఊహించని విధంగా ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ పంపించారు. చిరంజీవి లాంటి ఒక లెజెండరీ నటుడు నుంచి తనకు గిఫ్ట్ రావడంతో త్రిష సంతోషంలో మునికి తేలుతుంది..ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ సంతోషాన్ని వ్యక్తం చేశారు

త్రిష కోసం చిరంజీవి ఒక మగ్ కానుకగా ఇచ్చారని తెలుస్తోంది. అసలు మగ్ కానుకగా ఇవ్వడం ఏంటి అసలు దీని స్పెషల్ ఏంటి అనే విషయానికి వస్తే ఈ మగ్ త్రిష బాడీ టెంపరేచర్ ను కంట్రోల్ చేస్తూ ఉంటుందట. ఇలా ఎంతో స్పెషాలిటీ కలిగి ఉన్నటువంటి ఈ మగ్ త్రిష కోసం ప్రత్యేకంగా చిరంజీవి పంపించడంతో ఆమె సంతోషాన్ని వ్యక్తం చేస్తూ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.

Read More : విశాఖకు బయలుదేరిన మెగా హీరోలు .. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్!

ట్రెండింగ్ వార్తలు