విశాఖకు బయలుదేరిన మెగా హీరోలు .. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్!

March 11, 2024

విశాఖకు బయలుదేరిన మెగా హీరోలు .. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్!

విశాఖపట్నంలో మెగా హీరోలు అడుగుపెడుతున్నారని తెలిసి పండగ వాతావరణం నెలకొంది. మెగా ఫ్యాన్స్ వారి రాకకై ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఏ మెగా హీరోలు.. ఎందుకు విశాఖపట్నం చేరుకుంటున్నారు అంటే రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇద్దరూ విశాఖపట్నం చేరుకుంటున్నారు. ఆల్రెడీ అల్లు అర్జున్ విశాఖపట్నం చేరుకున్నారు.అభిమానులు అతడిని ఎయిర్ పోర్ట్ లో ఘనంగా స్వాగతించారు. ఈలలు, అరుపులతో తమ అభిమాన హీరోకు వెల్కమ్ చెప్పారు.

అల్లు అర్జున్ పై పూల వర్షం కురిపించారు. కార్లో ఎక్కాక రూఫ్ ఓపెన్ చేసి నిలబడి అభిమానులకు అభివాదం చేశారు. వైజాగ్ షిప్పింగ్ హార్బర్ కోర్టులో ఈ సినిమా షూటింగ్ జరుగనుంది. ఇక రామ్ చరణ్ కొద్ది రోజులలో విశాఖ రాబోతున్నాడు.ఇంతకీ వీళ్ళు వైజాగ్ వస్తున్నది పర్సనల్ పనుల మీదో లేదంటే రాజకీయ ప్రచారాల కోసమో కాదు వారి వారి సినిమా షూటింగ్ లు జరుపుకోవడం కోసం. అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2 చేస్తున్నాడు. ఈ సినిమా కొత్త షెడ్యూల్ విశాఖ పరిసర ప్రాంతాల్లో ప్రారంభం కాబోతుంది.

దాదాపు వారం రోజులపాటు విశాఖలోనే బన్నీ ఉంటాడని సమాచారం పుష్ప 2 కి సంబంధించిన కీలకమైన షెడ్యూల్ ఇక్కడే పూర్తి చేయబోతున్నారు. అందుకోసం ఫహద్ ఫాజిల్ కూడా ఈ షూటింగ్ లో యాడ్ అవుతారు. ఇక శంకర్ దర్శకత్వంలో కొన్ని సంవత్సరాలుగా షూటింగ్ జరుపుకుంటున్న రామ్ చరణ్ సినిమా గేమ్ చేంజర్. ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన షెడ్యూల్ విశాఖలోనే ప్రారంభించబోతున్నారు. అందుకోసమే రామ్ చరణ్ విశాఖ వస్తున్నారు రెండు మూడు రోజుల్లో ల్యాండ్ అవుతారు.

ఈ షెడ్యూల్ ఈ నెలాఖరు వరకు జరుగుతుందని సమాచారం. ఒక లెజెండరీ డైరెక్టర్ స్టార్ హీరో రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి మొదటి నుంచి ఈ సినిమాపై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నారు. ఒక పాత్ర ఐఏఎస్ ఆఫీసర్ అయితే మరొక పాత్ర గ్రామస్తుడిగా కనిపిస్తారట. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను తమిళ, హిందీ, తెలుగులో చిత్రీకరిస్తున్నారు.

Read More : జగన్ ను కచ్చితంగా దించాల్సిందే.. బాబు వ్యూహాలతో జగన్ మైండ్ బ్లాంక్ అవుతోందా?

ట్రెండింగ్ వార్తలు