విజయ్‌ అంటే ఎందుకు ఇష్టమో వెల్లడించిన జాన్వీ కపూర్‌

August 7, 2022

విజయ్‌ అంటే ఎందుకు ఇష్టమో వెల్లడించిన జాన్వీ కపూర్‌

రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అర్జున్‌రెడ్డి సినిమాతో ఓవర్‌ నైట్‌ స్టార్‌డమ్‌ సంపాదించుకున్న విజయ్‌కు సౌత్‌లోనే కాకుండా నార్త్‌లోనూ అభిమానులున్నారు. అంతేకాకుండా బాలీవుడ్‌ హీరోయిన్స్‌ సైతం విజయ్‌ క్రేజ్‌ చూసి ఫిదా అవుతుంటారు. సారా అలీఖాన్‌, జాన్వీకపూర్‌ వంటి బ్యూటీస్‌ విజయ్‌పై ఉన్న ఇష్టాన్ని కెమెరా ముందే ఎన్నోసార్లు వ్యక్తపరిచారు.

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన జాన్వీ కపూర్‌ రౌడీ పాపులారిటీ వెనకున్న సీక్రెట్‌ ఏంటో చెప్పింది. విజయ్‌ పెద్ద స్టార్‌ మాత్రమే కాదని, అతను గొప్ప వ్యక్తి అంటూ ఆకాశానికెత్తేసింది. నటుడిగానే కాకుండా వ్యక్తిత్వంతోనూ ఎంతోమంది ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నాడని పొగడ్తలతో ముంచెత్తింది. ఇక ఎప్పటికైనా విజయ్‌తో కలిసి నటిస్తానంటూ తన ఫ్యాన్‌ మూమెంట్‌ను తెలిపింది.

ట్రెండింగ్ వార్తలు