July 3, 2022
టాలీవుడ్‌లో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ హీరోగా 2020 డిసెంబరులో ఓ సినిమా మొదలైన సంగతి గుర్తుండే ఉంటుంది. 2020 డిసెంబరులో ఈ సినిమా ప్రారంభోత్పవం హైదరాబాద్‌లోని రామా నాయుడు స్టూడియోలో ఘనంగా జరిగింది. కె. వెంకటరమణ నిర్మాత. మురళీ రాజ్ దర్శకుడు. దిగంగన సూర్యవంశీ ఈ సినిమాలో హీరోయిన్. ఇంతవరకు బాగానే ఉంది కానీ జూలై 2న జానీ మాస్టర్ బర్త్ డే.
సో..సాధారంగానే ఈ సినిమా అప్‌డేట్‌ను ఊహిస్తారు సినీ లవర్స్. కానీ ఆ ఊసే లేదు. దీంతో ఈ సినిమా ఆగిపోయినట్లేనని అంటున్నారు సినీ విశ్లేషకులు. అన్నట్లు ఇంకోమాట అప్పట్లో జానీ మాస్టర్ తనకు దర్శకత్వం చేసే ఆలోచన కూడా ఉందనట్లుగా చెప్పారు. హీరోగా స్టార్ట్ అయిన సినిమాకే దిక్కులేదు..మరి.. డైరెక్షన్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ