ఆ డైరక్టర్ కారణంగా ప్రభాస్ ఎన్టీఆర్ మద్య మాటలు లేవా.. ఏమైందంటే?

April 26, 2024

ఆ డైరక్టర్ కారణంగా ప్రభాస్ ఎన్టీఆర్ మద్య మాటలు లేవా.. ఏమైందంటే?

సినీ ఇండస్ట్రీలో కొనసాగే హీరోల అభిమానుల మధ్య పెద్ద ఎత్తున పోటీ ఉంటుంది. తమ హీరో గొప్ప అంటే తమ హీరో గొప్ప అని ఎప్పుడూ కూడా అభిమానులు హీరోల విషయంలో ఇతర హీరోల అభిమానులతో గొడవ పడుతూనే ఉంటారు. కానీ హీరోలు మాత్రం ఎప్పుడు చాలా స్నేహ బంధంతో కొనసాగుతూ ఉంటారు. ఇలా ఇండస్ట్రీలో హీరోల మధ్య ఎంత మంచి అనుబంధం ఉందని చెప్పాలి. ఇక ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతూ ఉన్నటువంటి వారిలో నటుడు ప్రభాస్(Prabhas), ఎన్టీఆర్(Ntr) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరి మధ్య ఎంతో మంచి అనుబంధం ఉంది ఇద్దరూ కూడా పాన్ ఇండియా స్టార్ హీరోలుగా గుర్తింపు పొందారు.

ప్రస్తుతం వీరిద్దరూ వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ప్రభాస్ బాహుబలి సినిమాతో పాన్  ఇండియా స్టార్ హీరోగా మారిపోయారు. ఈ సినిమా నుంచి ఈయన తదుపరి సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ సైతం RRR సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయారు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమాలు కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.

ప్రస్తుతం ప్రభాస్ స్పిరిట్, రాజా సాబ్ సినిమాలతో పాటు హనురాగవపూడితో కూడా సినిమా చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. మరోవైపు ఎన్టీఆర్ వార్2 సినిమా పనులలో బిజీగా ఉన్నారు అలాగే కొరటాల శివ దర్శకత్వంలో ఈయన దేవర (Devara) సినిమా షూటింగ్ పనులలో కూడా బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఇలా కెరియర్ పరంగా ఎవరి సినిమాలలో వారు బిజీగా ఉండడమే కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా చాలా స్నేహంగా ఉండే వీరిద్దరి మధ్య ఓ గొడవ కారణంగా ఆరు నెలలు మాట్లాడుకోలేదంటూ ఒక వార్త వైరల్ గా మారింది.

ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీలకు కొనసాగుతున్నటువంటి వీరిద్దరి మధ్య ఓ డైరెక్టర్ సినిమాల విషయంలో పుల్లలు పెట్టారట. ఇలా డైరెక్టర్ కారణంగా ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి ఏకంగా ఆరు నెలల పాటు మాట్లాడుకోవడం లేదని తెలుస్తుంది కానీ ఆ డైరెక్టర్ ఇద్దరికీ దూరం పెంచడం కోసమే అలా చేశారనే విషయం తెలియడంతో ఇద్దరి మధ్య మనస్పర్ధలు తొలగిపోయి ఎప్పటిలాగే స్నేహంగా ఉన్నారని తెలుస్తుంది. అయితే ఆ డైరెక్టర్ ఇద్దరు హీరోలకు మంచి బ్లాక్ బస్టర్ సినిమాలను అందించారు. ప్రస్తుతం అయితే ఆయనకు సినిమా అవకాశాలు లేక అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారని చెప్పాలి.

Read More: పుష్ప‌-2 ది రూల్‌ టైటిల్‌ సాంగ్‌ రాబోయేది అప్పుడే?

Related News

ట్రెండింగ్ వార్తలు