Kalapuram Review: కళాపురం రివ్యూ అండ్ రేటింగ్

August 26, 2022

Kalapuram Review: కళాపురం రివ్యూ అండ్ రేటింగ్

  • Cast : , ,
  • Director :
  • Producer :
  • Banner :
  • Music :

/ 5

‘పలాస 1978’ .. వంటి రా అండ్ ర‌స్టిక్ చిత్రంతో ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌ట‌మే కాదు.. విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్నారు ద‌ర్శ‌కుడు క‌రుణ కుమార్. ఆ త‌ర్వాత సుధీర్‌బాబుతో చేసిన శ్రీ‌దేవి సోడా సెంట‌ర్ ప‌ర్వాలేద‌నిపించుకుంది. మూడో సినిమాగా స‌త్యం రాజేష్‌, చిత్రం శ్రీను ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా కామెడీ డ్రామా కాన్సెప్ట్‌తో తెర‌కెక్కించిన చిత్ర‌మే ‘కళాపురం’ ‘ఈ ఊరిలో అందరూ కళాకారులే’ సినిమా క్యాప్షన్. ఈ మూవీకి ప‌వ‌న్‌క‌ళ్యాణ్ స‌పోర్ట్ చేయ‌డంతో కావాల్సిన బ‌జ్ వ‌చ్చింది. అయితే ఆగ‌స్ట్ 26న విడుద‌లైన ఈ మూవీ ఎలా ఉందో చూడండి.

కథ: దర్శకుడిగా ఇండస్ట్రీలో ప్రయత్నాలు చేస్తుంటాడు రాజేష్‌ కుమార్‌ (‘సత్యం’ రాజేష్‌). హీరోయిన్‌గా ప్రయత్నాలు చేస్తుంటుంది ఇందు (కశీమా రఫి). ఈ ఇద్దరు ప్రేమలో ఉంటారు. కానీ హీరోయిన్‌ అవ కాశాల కోసం రాజేష్‌ను ఇందు మోసం చేస్తుంది. ఇటు ప్రేమలో, అటు కెరీర్‌లో ఫెయిల్‌ అయిన రాజేష్‌ డైరెక్టర్‌ కావాలన్న తన ఆశయాన్ని వదులుకుని బెంగళూరులో ఏదో ఒక ఉద్యోగం చూసుకోవాలనుకుంటాడు. ఈ తరుణంలో రాజేష్, అతని ఫ్రెండ్‌ ప్రవీణ్‌లకు కళాపురం నుంచి హైదరాబాద్‌కు వచ్చి ప్రొడ్యూసర్‌ కావాలనుకునే అప్పారావు(పలాస జనార్థన్‌) పరిచయం అవుతాడు. రాజేష్‌కు దర్శకుడిగా చాన్స్‌ ఇస్తాడు అప్పారావు. కానీ సొంతూరు కళాపురంలో కొంత షూటింగ్‌ చేయాలని షరతు పెడతాడు. ఇటు అప్పారావు ఇచ్చిన డబ్బుతో సినిమా తీయడానికి కళాపురం వస్తాడు రాజేష్‌. కానీ కళాపురంలో బై ఎలక్షన్స్‌ జరుగుతున్న నేపథ్యంలో సినిమా తీయనడాకి అప్పారావు రాజేష్‌కు ఇచ్చిన డబ్బులను సీజ్‌ చేస్తారు పోలీసులు. రాజేష్‌కు అప్పారావు మోసగాడని, అతన్ని పోలీసులు అరెస్ట్‌ చేశారని తెలుస్తుంది. అప్పుడు రాజేష్‌ ఏం చేశాడు? దర్శకుడు కావాలన్న తన కలను నిజం చేసుకున్నాడా? కళాపురంలో శారద(సంచిత) రాజేష్‌ను ఎందుకు ప్రేమిస్తుంది? రాజేష్‌ సినిమాకు, కళాపురం నియోజకవర్గంలో జరుగుతున్న బై ఎలక్షన్స్‌కు కనెక్షన్‌ ఏంటీ? అన్నది మిగిలిన కథ

విశ్లేషణ: ఈ సినిమాలో ‘వినేవాడు వెధవ అయితే ఎండుచేప కూడా ఈత కొడుతుందని చెబుతావు నువ్వు’ అనే డైలాగ్‌ ఉంటుంది. సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు కూడా దర్శకుడి గురించి ఇలానే అనుకుంటారేమో. అలా ఉంది సినిమా. ఫస్టాఫ్‌ అంతా హైదరాబాద్‌లో ఉంటే, సెకండాఫ్‌ అంతా కళాపురంలో ఉంటుంది. సినిమా స్టార్టింగ్‌లో రాజేష్‌ ఎంతో ప్రతిభావంతుడిగా చూపించిన‌ దర్శకుడు రాను రాను అతన్నీ సినిమాలో ఓ బకరాగా చూపిస్తాడు. అసలు కథ కూడా సెకండాఫ్‌లోనే స్టార్ట్‌ అవుతుంది. సాధారణంగా హీరోలు సినిమాను ముందుకు నడిపిస్తే…ఈ సినిమాలో మాత్రం అసలు ఏం జరుగుతుందో హీరోకే తెలియని పరిస్థితి. కళాపురం ఓ చిన్న ఊరని, ఇక్కడ ఉన్న కళాకారులు అందరు ఇప్పుడులేరని వేరే చోటుకు వెళ్లిపోయారని దర్శకుడు చెబుతాడు. అలాంటి చిన్న ఊరు ఓ నియోజకవర్గం బై ఎలక్షన్స్‌ను ఎలా డిసైడ్‌ చేస్తుందో దర్శకుడు సరైన రితీలో చూపించలేదనే చెప్పాలి. అలాగే దర్శకుడు సినిమాలో ఓ ‘నాగేశ్వరి’ అనే సినిమా తీస్తాడు. ఈ సినిమా అంతా ఒక్కపాటలోనే పూర్తవ్వడం ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్‌ చేస్తుంది. ముఖ్యంగా సినిమాలో పాము క్యారెక్టర్‌కు వాయిస్‌ ఓవర్‌ పెట్టడం, నాగదేవత అని చెప్పి, ఆ పాము పాత్రతో ఓ భూతు మాట అనిపించడంతో అర్థం ఏమిటో దర్శకుడికే తెలియాలి. కథలో అక్కడక్కడ మాత్రం కాస్త సాగదీత ఉంటుంది. అయితే సినిమా స్టార్టింగ్‌లో అవకాశాల కోసం ఇబ్బందిపడే దర్శకుల బాధను వారి కష్టాన్ని బాగా చూపించారు దర్శకులు. ఫస్టాప్‌లో ఇందు, రాజేష్‌లో మధ్య వర్షంలో వచ్చే ఎమోషనల్‌ సీన్, సెకండాఫ్‌లో కామెడీ పండించే బ్రదర్‌ సీన్స్‌ ఆడియన్స్‌ను కాస్త నవ్వించేలా చేస్తాయి. ఇవి తప్ప సినిమాలో పెద్దగా చెప్పుకోవాల్సింది ఏమీ లేదు.

ఎవరు ఎలా చేశారంటే! డైరెక్టర్‌ కావాలనుకునే యువకుడి పాత్రలో ‘సత్యం’ రాజేష్‌ మెప్పించాడు. కానీ అది ఫస్టాఫ్‌ వరకు మాత్రమే. సెకండాఫ్‌లో హీరో క్యారెక్టరైజేషన్‌ పెద్దగా ఉండదు. కశీమా ఉన్నంతలో పర్వాలేదనిపించింది. సంచితకు పెద్దగా యాక్టింగ్‌ చేసేందుకు స్కోప్‌ లేదు కథలో. అప్పారావుగా పలాస జనార్థన్‌ ఒకే అనిపిస్తాడు. జబర్ధస్త్‌ అప్పారావు మరికొందరు వారి వారి పాత్రలకు తగ్గ యాక్టింగ్‌ చేశారు. పాటలు, కెమెరాల పనితనం చెప్పుకునేంత అవకాశం ఇవ్వలేదు దర్శకుడు.

బలాలు సత్యం రాజేష్‌ యాక్టింగ్‌ (ఫస్ట్‌ హాఫ్‌లో..) కొన్ని సీన్స్‌ క్లైమాక్స్‌లో ట్విస్ట్‌

బలహీనతలు కథలో సాగదీత హీరో క్యారెక్టరైజేషన్‌ ఎక్కువక్యారెక్టర్లు, పాత్రల పరిచయానికి సమయం వృధా కావడం

బాట‌మ్‌లైన్: క‌ళాపురానికి వెళ్ల‌క‌పోతేనే బెట‌ర్‌

చిత్ర‌సీమ రేటింగ్‌: 1/5

ట్రెండింగ్ వార్తలు