ఈ నెల 19న కర్ణాటకలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకున్న గరుడ గమన వృషభ వాహన
(Garuda Gamana Vrishabha Vahana)చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి స్పందన లభిస్తోంది. ఈ మూవీని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రాంతాల్లో ప్రత్యేక షోల ద్వారా వీక్షిస్తున్నారు ప్రేక్షకులు. ఈ గ్యాంగ్ స్టర్ థ్రిల్లర్ డ్రామా థియేటర్లో చూడాలి అనుకునేవారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతోందట. రిషబ్ శెట్టి, రాజ్ బి శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో హీరోయిన్ ఉండదు. డ్యూయెట్లు కానీ కామెడీ సన్నివేశాలు కానీ నిపించవు. రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ కి భిన్నంగా పూర్తిగా వయొలెంట్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది.కథేంటి? మంగళూరు ప్రాంతం మంగళాదేవి అనే ఊరిలో ఇద్దరు పేరు మోసిన రౌడీ షీటర్లు హరి(రిషబ్ శెట్టి), శివ(రాజ్ బి శెట్టి)లు. తమకు అడ్డు వస్తున్నారనో లేదా ఎదిరిస్తున్నారో అనిపిస్తే చాలు ముందు వెనుకా చూడకుండా వాళ్ళను కిరాతకంగా హత్యలు చేస్తుంటాడు శివ. హరి తన అండదండలతో అక్కడో ముఠా నాయకుడిగా ఎదుగుతాడు. వీళ్ళ అంతు చూసేందుకు స్థానిక ఎమ్మెల్యే ఒక పోలీస్ ఇన్స్ పెక్టర్(గోపాల్ దేశ్ పాండే)ని ట్రాన్స్ఫర్ మీద ఆ ఊరికి తీసుకొస్తాడు. చట్టప్రకారం వాళ్ళను ఏమీ చేయలేమని గుర్తించి ముల్లుని ముల్లుతోనే తీయాలనే సూత్రం అనుసరించి ఆ ఇన్స్‌పెక్టర్ వాళ్ళను ఎలా చావు దాకా తీసుకొచ్చాడనేదే కథనిజానికి ఇందులో కనివిని ఎరుగని పాయింట్ ఏమి లేదు. కాకపోతే దర్శకుడు రాజ్ బి శెట్టితో పాటు రిషబ్ శెట్టిల అద్భుతమైన నటన, సహజంగా అనిపించే లొకేషన్స్, మాస్ ఎలివేషన్ సినిమాకు హైలెట్.
సంగీత దర్శకుడు మిథున్ ముకుందన్ బీజీఎమ్ ఎప్పటికప్పుడు ఆడియన్స్‌ని కథ నుండి డీవియేట్ అవకుండా చూస్తుంది. ఇలాంటి కథతో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. రామ్ పోతినేని హీరోగా సుకుమార్ దర్శకత్వం వహించిన
జగడం సినిమా కూడా దాదాపు ఇదే కోవలోకి వస్తుంది. అలాగే సూర్య నటించిన
ఆరు సినిమా కథ కూడా ఇదే..అయినప్పటికీ ఈ సినిమాలోని మాస్ టేకింగ్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.