కె.జి.ఎఫ్‌: చాప్టర్ 2 Review and Rating

April 14, 2022

కె.జి.ఎఫ్‌: చాప్టర్ 2 Review and Rating

చిత్రం: కె.జి.ఎఫ్‌: చాప్టర్ 2 నటీనటులు: యష్, శ్రీనిధి శెట్టి, సంజయ్ దత్, రవీనా టాండన్, ప్రకాష్ రాజ్, అచ్యుత్ కుమార్, మాలవిక అవినాష్, రావు రమేష్ తదితరులు సంగీతం: రవి బస్రుర్ సినిమాటోగ్రఫీ: భువన గౌడ నిర్మాత: విజయ్ కిరగందుర్ దర్శకత్వం: ప్రశాంత్ నీల్ బ్యానర్: హాంబలే ఫిల్మ్స్ విడుదల తేది: 14/04/2022

కన్నడ రాకింగ్‌స్టార్ య‌శ్‌, ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్‌కి ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆద‌ర‌ణ ద‌క్కించిన చిత్రం కె.జి.ఎఫ్‌. సాధార‌ణ అంచ‌నాల‌తో రిలీజైన ఈ చిత్రం అసాధార‌ణ రీతిలో వ‌సూళ్ల వ‌ర్షం కురిపించింది. ఈ సినిమాలో య‌శ్ న‌ట‌న‌, ప్రశాంత్ నీల్ టేకింగ్‌కి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు సైతం ద‌క్కాయి. కన్నడ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో 100 కోట్లు వసూలు చేసిన సినిమాగా కేజీఎఫ్‌కి ఓ రికార్డు ఉంది. కన్నడలో మాత్రమే కాక ఈ సినిమా మిగతా భాషల్లో కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దాంతో కె.జి.ఎఫ్ సీక్వెల్ కె.జి.ఎఫ్ చాప్ట‌ర్‌2 లో సంజయ్ దత్, రవీనా టాండన్, ప్రకాష్ రాజ్ వంటి పేరున్న న‌టీన‌టులను భాగం చేసి ప్యాన్ ఇండియా అప్పీల్‌ను తీసుకువ‌చ్చింది చిత్ర యూనిట్‌. టీజర్ మరియు ట్రైలర్ లతోనే అంచనాలను మరింతగా పెంచిన ఈ సినిమా ఏప్రిల్ 14, 2022 న ప్ర‌పంచ‌వ్యాప్తంగా 10000కి పైగా థియేట‌ర్స్‌లో విడుద‌లైంది. ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకూ మెప్పించిందో చూద్దాం

కథ: “కే జి ఎఫ్: చాప్టర్ 1” సినిమా ఎక్కడైతే ముగుస్తుందో “కే జి ఎఫ్: చాప్టర్ 2” అక్కడే మొదలవుతుంది. గ‌రుడ‌ని చంపి రాకీ కే జి ఎఫ్ నీ సొంతం చేసుకుంటాడు. కానీ అప్ప‌టికే కే జి ఎఫ్ మీద చాలా మందికి కన్ను ఉంటుంది. అందులో వైకింగ్స్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న అధీరా (సంజయ్ దత్) కూడా ఒకరు. దీంతో రాఖీ మరియు అధీరాలకు మధ్య యుద్ధం మొదలవుతుంది. ఇది ఇలా ఉండ‌గా ప్రైమ్ మినిస్ట‌ర్‌(ర‌వీనా టాండే) దృష్టికి రాకీ వ్యవ‌హారం వ‌స్తుంది. ప్ర‌పంచంలోనే అతి పెద్ద స్మ‌గ్ల‌ర్ కావ‌డంతో అత‌న్ని ఎలాగైన అంత‌మొందించాల‌ని డైత్ వారెంట్ ఇష్యూ చేస్తుంది. ఒక వైపు అధీర‌, మ‌రో వైపు ఇండియ‌న్‌ ఆర్మీని ఎలా ఎద‌ర్కొన్నాడు అన్న‌ది మిగ‌తా క‌థ‌.

నటీనటుల ప‌నితీరు: రాకీ పాత్రలో మరెవరు సూట్ అవ్వరు అనే అంత అద్భుతంగా యష్ తన పాత్రలో ఒదిగిపోయి అద్భుతమైన నటనను కనబరిచారు. సినిమా మొత్తం తన అద్భుతమైన నటనతో తన భుజాలపై మోశారు యష్. మొదటి సినిమాతో పోలిస్తే ఈ సినిమాలో యష్ పాత్ర మరింత ఇంటెన్స్ గా ఉన్నప్పటికీ చాలా ఈజ్‌తో న‌టించాడు. ముఖ్యంగా రాకీ ఇంట్ర‌డ‌క్ష‌న్ సీన్ స్క్రీన్‌పై అదిరిపోతుంది. కేవ‌లం న‌ట‌న‌తోనే కాకుండా యాక్ష‌న్ మ‌రియు డైలాగ్ డెలివ‌రీతో కూడా ఆక‌ట్టుకున్నాడు. ఇక సంజయ్ దత్ నటన ఈ సినిమాకి అతి పెద్ద ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. ఆధీరా పాత్రలో సంజయ్ దత్ పూర్తి స్థాయిలో న్యాయం చేశారు. మొదటి భాగంతో పోలిస్తే శ్రీనిధి శెట్టికి కాస్త ఎక్కువ స్క్రీన్ స్పేస్ దొరికింది. ఇక ప్రైమ్ మినిస్ట‌ర్‌గా ర‌వీనా టాండ‌న్ అద‌ర‌గొట్టింద‌నే చెప్పాలి. కేవ‌లం ఎక్స్‌ప్రెష‌న్స్‌తోనే సినిమాను నెక్ట్ లెవ‌ల్‌కి తీసుకెళ్లింది. ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించిన ప్రకాశ్‌ రాజ్, రావు రమేష్ తదితరులు కూడా తమ పాత్రల పరిధి మేర చ‌క్క‌గా నటించారు.

సాంకేతిక వర్గం: డైరెక్టర్ ప్రశాంత్ నీల్ చాప్ట‌ర్ 1కి అద్భుతమైన కొన‌సాగింపుగా చాప్ట‌ర్ 2 క‌థ‌ను రాసుకున్నాడు. అయితే ఎక్కువ పాత్ర‌లు ఉండ‌డంతో కొంత త‌డ‌బ‌డ్డాడు. స్క్రీన్ ప్లే ప‌రిగెత్తుతున్న‌ప్ప‌టికీ ఎక్క‌డో బోర్ కొడుతున్న ఫీలింగ్ కూడా క‌లుగుతుంది. ఈ సినిమాలో కూడా ప్రశాంత్ నీల్ ఎలివేషన్స్‌ మీద బాగా దృష్టి పెట్టారు. మ‌రీ ముఖ్యంగా హీరోతో పాటు సంజ‌య్‌ద‌త్‌, ర‌వీనా టాండే ఎలివేష‌న్ సీన్స్ ఎక్కువ అయ్యే స‌రికి క‌థ బోరింగ్ గా అనిపిస్తుంది. అయితే ర‌వి బ‌స్రూర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ థియేట‌ర్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చిన మ‌న‌ల్ని వెంటాడుతుంది. సినిమాటోగ్రాఫర్ పనితనం కూడా సినిమాకి చాలా బాగా ప్లస్ అయ్యింది. గ‌న్ ఫైరింగ్‌, క్లైమాక్స్‌లో షిప్ లో వ‌చ్చే విజువ‌ల్స్ ఆడియ‌న్స్ చేత విజిల్స్ వేయిస్తాయి. నిర్మాణ విలువ‌లు ఉన్న‌తంగా ఉన్నాయి. అయితే ఎడిటింగ్ ఈ సినిమాకి మైన‌స్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా సెకండాఫ్‌లో హీరోహీరోయిన్ల మ‌ధ్య వ‌చ్చే పాట క‌థ‌కు అన‌వ‌స‌రం అనిపిస్తుంది. ఆ పాట ఎడిట్ చేసుంటే బాగుండేది.

బలాలు:

క‌థ‌

యష్, సంజ‌య్ ద‌త్‌, ర‌వీనా టాండే నటన

నేపథ్య సంగీతం

సినిమాటోగ్రఫీ

బలహీనతలు:

నిడివి

అన‌వ‌స‌ర‌పు ఎలివేష‌న్లు

చివ‌ర‌గా: భారీ అంచ‌నాల‌తో విడుద‌లైన కేజీఎఫ్ చాప్ట‌ర్ 2 ఆ అంచ‌నాల‌ను అందుకోవ‌డంలో స‌క్సెస్ అయింద‌నే చెప్పొచ్చు. యాక్షన్‌ సీక్వెన్స్‌ పరంగా కేజీఎఫ్‌ చాప్టర్‌ 1 కంటే చాప్టర్‌ 2లో ఎక్కువ సీన్స్‌ కనిపిస్తాయి. ఎమోష‌న‌ల్ కంటెంట్ కూడా ఎక్కువే ఉంటుంది. టెక్నికల్‌ టీమ్‌ కష్టం స్క్రీన్‌పై కనిపిస్తుంది. కాని అన‌వ‌స‌ర‌పు ఎలివేష‌న్లు, నిడివి స‌గ‌టు ప్రేక్ష‌కుడికి బోర్ కొట్టిస్తాయి.

బాట‌మ్‌లైన్‌: యాక్ష‌న్, ఎమోష‌న్‌, ఎలివేష‌న్‌

చిత్ర‌సీమ రేటింగ్ : 2.75 /5

Related News

ట్రెండింగ్ వార్తలు