`మా` అధ్య‌క్షుడి జాడేది..?

December 29, 2021

`మా` అధ్య‌క్షుడి జాడేది..?

తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ ఇప్పుడు సంక్షోభంలో ఉంది. ఏపీలో దారుణ ప‌రిస్థితులు ఎదుర‌వు తున్నాయి. అక్క‌డ దాదాపు 200 థియేట‌ర్లు మూసేసిన‌ట్టు స‌మాచారం. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవ‌కాశం కూడా ఉంది. ఇప్ప‌టికే రిప‌బ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఈ ఇష్యూపై వాయిస్ రైజ్ చేశారు. కాని ఇండ‌స్ట్రీ నుండి ఎలాంటి స‌పోర్ట్ ల‌భించ‌లేదు. దాంతో ప‌వ‌న్ ఈ విష‌యాన్ని ప్ర‌క్క‌న‌పెట్టారు. అయితే టికెట్ రేట్ల‌పై యువ హీరోలు ఇప్పుడిప్పుడే గ‌ళం విప్పుతున్నారు. శ్యామ్ సింగ‌రాయ్ ప్రెస్‌మీట్‌లో నాని థియేట‌ర్ వ‌సూళ్ల‌ని కిరాణ షాపు లెక్క‌ల‌తో పోల్చ‌డం వివాదాన్ని, ప్ర‌కంప‌ల్ని సృష్టించింది. తాజాగా నిఖిల్ కూడా ఈ విష‌యంపై స్పందించాడు. క్ర‌మంగా యువ హీరోలు త‌మ వాయిస్ వినిపించే ప్ర‌య‌త్నం అయితే చేస్తున్నారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది కాని ఇన్ని జ‌రుగుతున్నా జ‌గ‌న్ మా కుంటుంబ స‌భ్యుడ‌ని, కేటీఆర్ త‌ను చిన్న‌ప్ప‌టి నుండి మంచి ఫ్రెండ్స్ అని చెప్పే `మా` అధ్య‌క్షుడు మంచు విష్ణు అలికిడి లేదు. మా ఎల‌క్ష‌న్స్ టైమ్‌లో ప్ర‌తి చిన్న విష‌యానికి ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడిన మంచు విష్ణు థియేట‌ర్ల ప‌రిస్థితి గురించి ఇంత వ‌ర‌కు మాట్లాడ‌లేదు. మంచు విష్ఱు మా ప్రెసిడెంట్ మాత్ర‌మే కాదు. నిర్మాత కూడా. ఓ నిర్మాత సాధ‌క బాధ‌కాలు అర్థం చేసుకోవాల్సిన ఈ త‌రుణంలో నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు ఉండిపోవ‌డం ఆశ్చ‌ర్యంగా ఉంది.

ట్రెండింగ్ వార్తలు