August 12, 2022
చిత్రం: మాచర్ల నియోజకవర్గం
తారాగణం: నితిన్, కేథరీన్, కృతీ శెట్టి, సముద్ర ఖని, ‘వెన్నెల’ కిశోర్, మురళీ శర్మ, రాజేంద్రప్రసాద్ దర్శకత్వం: ఎమ్ఎస్ రాజశేఖర్‌రెడ్డి (తొలి పరిచయం) నిర్మాత: ఎన్.సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి సంగీతం: మహతి స్వర సాగర్ కెమెరా: ప్రసాద్ మూరెళ్ల డైలాగ్స్: మామిడాల తిరుపతి ఫైట్స్: వెంకట్ విడుదల తేదీ: ఆగస్టు 12, 2022
కథ మాచర్ల నియోజకవర్గంలో నాగప్ప(సముద్రఖని) చనిపోవడంతో అక్కడ ఉపఎన్నికలు వస్తాయి. దీంతో పార్టీ హైకమాండ్ నాగప్ప కొడుకు రాజప్ప(సముద్రఖని) ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తాడు. కానీ రాఘవయ్య (శుభలేఖ సుధాకర్) కు ఆ అవకాశం దక్కుతుంది. కానీ తనకొడుకు సూర్యను ఎన్నికల్లో నిలబెడతాడు రాఘవయ్య. కోపోద్రోక్తుడైన రాజప్ప ఎలక్షన్ రోజున పోలింగ్ కేంద్రాల్లో మారణహోమం సృష్టిస్తాడు. ఈ పనిలో భాగంగానే తనకు ప్రత్యర్థి అయిన రాఘవయ్య కొడుకు సూర్యంను హత్య చేయిస్తాడు రాజప్ప. అంతే రాజప్ప ఆగడాల కు భయపడిన అక్కడి ప్రజలు ఓటింగ్‌లో పాల్గొనరు. రాజప్ప ఆగడాలకు తోడు అతని కొడుకు వీర(సముద్రఖని) అరచాకాలకు కూడా జనం భయపడుతుంటారు. అలా మాచర్ల నియోజకవర్గంలో ముప్ఫై సంవత్సరాలు అసలు ఎన్నికలే జరగవు. మరోవైపు సివిల్స్ క్లియర్ చేసి పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న సిద్ధార్ధ్‌రెడ్డి (నితిన్)తాను ప్రేమించిన అమ్మాయి స్వాతి (కృతీశెట్టి) కోసం మాచర్ల వస్తాడు. స్వాతి వల్ల తనకుఇబ్బందులు వస్తున్నాయని గ్రహాంచిన వీర ఆమెను చంపెందుకు రెడీ అవుతాడు. సిద్ధార్థ్ వచ్చి స్వాతినిరక్షిస్తాడు. ఇదే సమయంలో సిద్దార్థ్‌కు గుంటూరు జిల్లా కలెక్టర్‌గా నియమితుడు అవుతాడు. మళ్లీమాచర్ల నియోజకవర్గంలో ఎలక్షన్స్ జరిగాయా? రాజప్పుకు స్వాతి ఎందుకు ఎదురు వెళ్లింది? సిద్ధార్థ్‌కు తాను ప్రేమించిన స్వాతి ఉన్న మాచర్ల నియోజకవర్గంలోనే పోస్టింగ్ ఎలా వచ్చింది? అన్నది మిగిలిన కథ.
విశ్లేషణ సినిమా మొదలైన పది నిమిషాలకై కథ అంతా ప్రేక్షకులకు అర్థం అవుతుంది. 30 ఏళ్లుగా ఎలక్షన్స్ జరగని మాచర్ల నియోజకవర్గంలో ఎలక్షన్స్ జరిగేలా చూడటం హీరో అని ఆడియన్స్‌కు తెలుస్తుంది. హీరో ఇంట్ర డక్షన్ ఫైట్, ఆ తర్వాత సాంగ్, ఆ నెక్ట్స్ సీన్ కామెడీ ఇలా రోటీన్ స్క్రీన్ ప్లే ఉంటుంది సినిమాలో. ఎలా ఉంటుందంటే పావుగంట తర్వాత రాబోయే సన్నివేశాన్ని కూడా ప్రేక్షకులు ఊహించేలా ఉంటుంది. ఇంట్రవెల్ వచ్చెంతవరకు కానీ అనుకున్న కథ ముందుకు కదలదు. సెకండాఫ్ కూడా ఫస్ట్హాప్లానే సాగుతుం…ది. కాకపోతేకాస్త యాక్షన్ ఎక్కువగా కనిపిస్తుంది. గుంటూరు జిల్లాలో మాచర్ల నియోజకవర్గంలో మాత్రమే ఎన్నికలు జరగవు. జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నప్పుడు జిల్లా కలెక్టర్ మాత్రం మాచర్లలోనే ఉంటాడు. మిగతా నియోజకవర్గాల్లో సమస్యలు ఏం లేనట్లుగా. ఎన్నికల జరుగుతున్నాయన్న విజువల్స్యే కానీ అక్కడ ఎన్నికల ఫ్లేవర్ స్క్రీన్పైకనిపించదు. ఎలక్షన్స్ జరిపించేందుకు హీరో చేసే ప్రయతాలు కూడా చాలా రోటీన్‌గా ఉంటాయి. వీడియోలు తీయడం, విలన్ ఇంటికి వెళ్లి వార్నింగ్ ఇవ్వడం గట్రా లాంటివి అన్నమాట. దర్శకుడు కథ ఇంకొంచెం బాగారాసుకుని ఉంటే బాగుండేది. అంత ఎన్నికల హడావిడి, ప్రచారం జరుగుతుంటే ఎవరు ఏ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారో, అసలు ఎవరి ఎన్నికల గుర్తులు ఏమిటో ఎవరికీ తెలియదు. ఆ విజువల్స్ సినిమాలో ఉంటే బాగుండేది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే సినిమాలో మైనస్ పాయింట్లు. కథ బాగుంటే ఏ ఎలక్షన్స్ అయినా బాగుంటాయి మరి. ‘రా రా రెడ్డి…స్పెషల్ సాంగ్’, క్లైమాక్స్‌లో ఉన్న స్మాల్ ట్విస్ట్, గుంతలకిడి గురునాథం (వెన్నెల కిశోర్) రెండు, మూడు కామెడీ సీన్స్ తప్ప సినిమాలో అంతగా ఏమీ లేదు. ఈ మూడు సీన్స్ కలిపితే పది నిమిషాలు. మిగతా అంతా ప్రేక్షకుల ఓపిక, ధైర్యం, సాహసం, దయలపై సినిమా సాగుతుంది.
ఎవరు ఎలా చేశారు? నితిన్ యాక్టింగ్ ఒకే అనిపిస్తుంది. లుక్స్ కొంచెం మాసీగా అనిపించిన యాక్టింగ్ మాత్రం రోటీనే. ఇక హీరోయిన్స్ క్యారెక్టర్స్‌కు అయితే యాక్టింగ్‌కు స్కోపే లేదు. పాత్ర రిత్యా కాస్త కృతీకి ఆ చాన్స్ ఉన్నప్పటికీ, ఈ చాన్స్‌ను కృతీ వినియోగించుకోలేదు. సినిమాలో తనను చంపేయడానికి విలన్స్ పెట్రోల్ పోస్తుంటే కృతీ మాత్రం చాలా కూల్‌గా కామ్‌గా ఉంటుంది. కన్నీళ్లు ఉండవు, ఏడుపులు ఉండవు. అందెంటో ఎలా గో హీరో వస్తాడులే అనే భరోసా కాబోలు. క్యాథరీన్ పాత్ర గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్. మినిష్టర్ కూతురు నిధిగా హీరోకు ఏమైనా హెల్ప్ చేయవచ్చు కానీ ఏమీ లేదు. ఇక గుంతలకిడి గురునాథంగా వెన్నెల కిశోర్ సన్నివేశాలు చాలా చిరాకుగా అనిపిస్తాయి. బలవంతగా నవ్వమన్నట్లుగా ఉంటాయి (ఒకటి రెండు సీన్స్ తప్ప..వీటితోనే సినిమా నడవదు). మురళీ శర్మ, రాజేంద్రప్రసాద్‌లాంటి సీనియర్ నటులు ఉన్న వీరిని సరైన దిశగా ఉపయోగించుకలేదు దర్శకుడు. స్క్రీన్‌పై చూపేందుకే ప్యాండింగ్ ఆర్టిస్టులను పెట్టుకున్నట్లు ఉన్నారు. ఇక స్వహతగా ఎడిటర్ అయిన ఎమ్ఎస్ రాజశేఖర్ రెడ్డి కథపై మరింత కసరత్తు చేసి ఉంటే బాగుండేది. ఎలక్షన్ రూల్స్, రిటర్నింగ్ ఆఫీసర్, నోడల్ ఆఫీసర్…వంటి అంశాలను తెలుసుకుంటే కథ ఇంకా బాగుండేది. ఇక నితిన్‌కు ‘భీష్మ’, ‘మ్యాస్ట్రో’ సినిమాలకు పని చేశారు మ్యూజిక్ డైరెక్టర్ మహతి స్వర సాగర్. ఆ సినిమాలో మంచి సాంగ్స్ ఇచ్చినప్పటికీని ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమాపై మహతి ప్రభావం అంతగా లేదనే చెప్పాలి. కమర్షియల్ సినిమా కాబట్టి ఫైట్స్, విజువల్స్ మాములుగానే ఉన్నాయి.
బలాలు స్పెషల్‌సాంగ్, కొన్ని కామెడీ సన్నివేశాలు
బలహీనతలు బోలెడు ఉన్నాయి
ఫైనల్ : మాచర్ల ఎలక్షన్స్ లో ఆడియెన్స్ ని ఓడించారు
చిత్రసీమ రేటింగ్: 2/5