మ‌ధుర‌పూడి గ్రామం అనే నేను మూవీ రివ్యూ,రేటింగ్‌

October 13, 2023

మ‌ధుర‌పూడి గ్రామం అనే నేను

మ‌ధుర‌పూడి గ్రామం అనే నేను

  • Cast : శివ కంఠ‌మ‌నేని, క్యాథ‌లిన్ గౌడ, భ‌ర‌ణి శంక‌ర్‌, స‌త్య‌, నూక‌రాజు త‌దిత‌రులు
  • Director : మల్లి
  • Producer : కేఎస్ శంకర్ రావు, ఆర్ వెంకటేశ్వరరావు
  • Banner : లైట్ హౌస్ సినీ మ్యాజిక్
  • Music : మణిశర్మ

3 / 5

భద్రాద్రి, కత్తి వంటి చిత్రాల దర్శకుడు మల్లి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం మ‌ధుర‌పూడి గ్రామం అనే నేను. ఈ చిత్రంలో అక్కడొకడుంటాడు ఫేమ్​ శివ కంఠమనేని హీరోగా నటించి ఈ చిత్రాన్ని నిర్మించారు. క్యాథలిన్​గౌడ్​ ఈ చిత్రం ద్వారా కథానాయికగా పరిచయమయింది. మణిశర్మ మెలోడీతో ఈ చిత్రంలో మాయ చేశారు. ముప్పా వెంకయ్య చౌదరి, జి. రాంబాబు యాదవ్​ కలిసి సమర్పించారు. లైట్​ హౌస్​ సినీ మ్యాజిక్​ పతాకం పై కే.ఎస్​.శంకర్​రావు, ఆర్​. వెంకటేశ్వరావులు కలిసి నిర్మించిన చిత్రమిది. ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్ర కథ కథనాలేంటో ఓసారి మన హెరాల్డ్​లో చూసేద్దాం.

కథ:

ఈ కథ మొత్తం మధురపూడి అనే గ్రామంఓ సాగుతుంది. మనుషులకు ఆత్మ ఉన్నట్లే ఒక ఊరికి ఆత్మ ఉంటే ఎలా ఉంటుంది అన్నరీతిలో ఈ కథ ఉంటుంది. శివకంఠమనేని సూరి అనే పాత్రలో చాలా మొండిగా మొరటుగా ఉంటాడు. స్నేహితుడు బాబ్జీ కోసం అన్ని విషయాల్లో అండగా నిలబడతాడు. వీరిద్దరి పాత్రలు కర్ణుడు, దుర్యోదనుడు పాత్రల్లా ఉంటాయి. స్నేహితుడి కోసం ప్రాణాలైన ఇచ్చేంత అభిమానిస్తాడు సూరి. కథ సాగుతుండగా హీరో సూరి జీవితంలోకి హీరోయిన్ (క్యాథ‌లిన్ గౌడ) ఎలా ఎంట్రీ అవుతుంది. చివరకు బాబ్జీ సూరి స్నేహబంధం ఏ విధంగా ఉంటుంది.. ఆ ఊరిలో జరిగే సూరి రాజకీయ పాత్రలు ఏమిటి ? ఓ 700 రూపాయల కోట్ల డిజిటల్​ స్కామ్​ ఎలా జరిగింది ఏంటి అన్నది తెలియాలంటే ప్రేక్షకులు థియేటర్​కి వెళ్ళాల్సిదే.

నటీనటులు:

మొరటుగా ఉండే పాత్ర కాబట్టి రొటీన్​ హీరోలు నటించినట్లు ఉండదు. కొత్త నటులు నటించడం వల్ల ఆ సీరియస్​నెస్​ వస్తుంది. కథ పాత్రకి తగ్గట్టుగా శివ కంఠమనేని తన వంతు ప్రయత్నం చాలా చక్కగా చేశాడు. అద్భుతమైన హాస్యం, ఎంతో చక్కటి ఎమోషన్స్​ని పండించడంలో ఆయన ధిట్ట అని చెప్పాలి. సాధారణంగా ఉండే కథానాయకుడిలా ఈ పాత్ర ఉండదు. కాస్త కొత్తగా ఉండటం వల్లనే సూరి పాత్రకి శివకంఠమనేని సరిపోతారని దర్శకుడు భావించాడు. కథానాయిక పాత్రలో క్యాథలిన్‌ వయసుకు మించిన పాత్ర అయినప్పటికీ తన లుక్స్‌తో ప్రేక్షకులని ఆకట్టుకుంది. క్లైమాక్స్‌ 30నిమిషాలు నటనకి ఎంతో ప్రాధాన్యత ఉన్న పాత్ర దక్కింది. కథలో కీలకమైన కథానాయకుడు స్నేహితుడి పాత్ర చాలా చక్కగా మలిచారు. వ‌నితా రెడ్డి, జ‌బ‌ర్‌ద‌స్త్ నూక‌రాజు, మ‌హేంద్ర‌న్ వారి వారి పాత్రలకు న్యాయం చేశారు.

విశ్లేషణ…

రివేంజ్‌, పొలిటికల్‌, లవ్, యాక్షన్‌ డ్రామా అన్ని కలగలిసిన చిత్రమిది. కమర్షియల్‌ పాయింట్లతో కలిసి అన్ని అంశాలను జోడిస్తూనే సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇవ్వడం అనేది చాలా కష్టతరమైన పని. కానీ దర్శకుడు ఈ చిత్రంలో ఇవన్నీ ఉండేలా ప్రయత్నించి విజయం సాధించారనే చెప్పాలి. అన్ని పాత్రలను అద్భుతంగా మార్చిన తీరు ఎంతో ప్రశంసనీయమని చెప్పాలి. మ‌ణిశ‌ర్మ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు మెయిన్ పిల్ల‌ర్ అని చెప్పొచ్చు. ఇంటర్వెల్‌కు ఆసక్తి పెరుగుతుంది. ఇక ద్వితీయార్దం అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. ప్రీ క్లైమాక్స్‌, క్లైమాక్స్‌లో ట్విస్టులు అందరినీ మెప్పిస్తాయి. క్లైమాక్స్‌లో హీరో పర్ఫామెన్స్, దర్శకుడు తెరకెక్కించిన తీరు మెప్పిస్తుంది. ఓ మంచి సినిమా చూశామనే ఫీలింగ్‌తో ప్రేక్షకుడు బయటకు వచ్చేలా దర్శకుడు చేయడంలో సక్సెస్ అయ్యారు.

టెక్నికల్‌గా  మ‌ధుర‌పూడి గ్రామం అనే నేను అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణ అంటే మణిశర్మ పాటలు, ఆర్ఆర్ అని చెప్పవచ్చ. సురేష్ భార్గవ్ విజువ‌ల్స్ సినిమాకు అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌. ప‌ల్లెటూరిలో ఈ చిత్ర షూటింగ్‌ అంతా జరగడంతో పల్లె అందాలన్నీ ఎంతో ఎంతో విజువలైజ్‌గా ఉన్నాయి. తక్కువ నిడివితో ప్రేక్షకుడ్ని బోర్ కొట్టించకుండా చక్కగా కత్తిరించాడు ఎడిటర్ గౌతంరాజు.

బాట‌మ్ లైన్‌: మ‌ధుర‌పూడి గ్రామం అనే నేను..ఆర్గానిక్ ల‌వ్ అండ్ యాక్ష‌న్ డ్రామా

Read More: అన్ని రకాల ఎమోషన్స్‌తో కూడిన చిత్రం..`మ‌ధుర‌పూడి గ్రామం అనే నేను` – హీరో శివ కంఠమనేని

ట్రెండింగ్ వార్తలు