లూసిఫర్ సినిమా రికార్డులను బద్దలు కొట్టిన మంజు మ్మేల్ బాయ్స్!

March 10, 2024

లూసిఫర్ సినిమా రికార్డులను బద్దలు కొట్టిన మంజు మ్మేల్ బాయ్స్!

సినిమా సక్సెస్ కావాలి అంటే భారీ తారాగణం భారీ బడ్జెట్ సినిమాలు అయి ఉండాల్సిన పనిలేదు సినిమాలో సత్తా ఉంటే ఒక చిన్న సినిమా అయినా కూడా ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తుంది. ఇలా ఎన్నో చిన్న సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలనమైనటువంటి విజయాలను సొంతం చేసుకున్నాయి. ఇలా తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషలలో కూడా చిన్న సినిమాలు భారీ సక్సెస్ అందుకున్నాయి అలాంటి సినిమా నే మంజుమ్మెల్ బాయ్స్ చిత్రమని చెప్పాలి.

చిదంబరం దర్శకత్వంలో శ్రీనాథ్, బాలు, బాసీ, వర్గీస్, గణపతి వంటి వారు ప్రధాన పాత్రలలో నటించినటువంటి చిత్రం మంజుమ్మెల్ బాయ్స్. ఈ సినిమా ఫిబ్రవరి 22వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది అయితే ఈ సినిమా విడుదలైనటువంటి మొదటి రోజు నుంచి కూడా ఊహించని స్థాయిలో కలెక్షన్లను రాబడుతూ సంచలనం సృష్టించింది.

ఇప్పటికే ఈ సినిమా 100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి మోహన్లాల్ నటించిన సూపర్ హిట్ చిత్రం లూసిఫర్ సినిమా రికార్డులను కూడా బ్రేక్ చేసింది. లూసిఫర్ సినిమా అప్పట్లో 127 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టగా మంజుమ్మెల్ బాయ్స్ చిత్రం కేవలం 16 రోజులలోనే ఏకంగా 130 కోట్ల కలెక్షన్స్ కాబట్టి సంచలనాలను సృష్టించింది ఇలా కలెక్షన్ ఇలాగే వస్తూ ఉంటే త్వరలోనే మోహన్లాల్ మరో రికార్డెడ్ చిత్రం పులి మురుగన్ (152) కోట్ల వసూళ్లను దాటడం పెద్ద కష్టమేమీ కాదని చెప్పాలి.

మొత్తానికి ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలనమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా కథ విషయానికి వస్తే కొచ్చిలోని ఓ స్నేహితుల బృందం కొడైకెనాల్ కి వెళ్తారు అక్కడ ఒక గుహలోకి వెళ్ళొద్దని చెప్పిన వెళ్తారు అలా వెళ్లడంతో వీరి ఫ్రెండ్స్ లో ఒకరు ఒక రంధ్రంలో పడిపోతారు ఎంత పిలిచినా పలకకపోవడంతో మిగిలిన వారందరూ బయటకు వస్తారు మరి ఆ గుహలో రంధ్రంలో పడిపోయినటువంటి తన స్నేహితుల బతికే ఉన్నాడా తన స్నేహితుడిని కాపాడుకోవడం కోసం మంజుమ్మెల్ బాయ్స్ ఏం చేశారు అన్నది ఈ సినిమా కథ.

Read More : కొత్త పేరుతో సరికొత్త ప్రయాణం మొదలుపెట్టిన మెగా మేనల్లుడు!

Related News

ట్రెండింగ్ వార్తలు