కమల్ హాసన్ సినిమా తో క్లాష్ కి దిగిన ధనుష్ సినిమా?

May 10, 2024

కమల్ హాసన్ సినిమా తో క్లాష్ కి దిగిన ధనుష్ సినిమా?

గ్లోబల్ స్టార్ టాలీవుడ్ నటుడైన ధనుష్ అతివేగంతో మంచి మంచి ప్రాజెక్ట్లను చేసుకుంటూ వస్తున్నారు. అయితే అన్నిటికన్నా ప్రత్యేకమైన ధనుష్ 50 వ చిత్రం “రాయణ్” కు తానే స్వీయ దర్శకత్వం చేసుకుంటున్నాడు. ఈ సినిమాకి సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ దర్శకత్వం వహిస్తుండగా తాజాగా ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేశారు చిత్రం బృందం. పాట చాలా పవర్ఫుల్ గా ఉండడంతో మంచి రెస్పాన్స్ ను తెచ్చుకుంది.

ఈ సినిమా ఫస్ట్ సింగిల్ తో పాటు రిలీజ్ డేట్ ని కూడా విడుదల చేశారు. ఈ సినిమా జూన్ 13న విడుదల కానుంది అని చిత్ర బృందం తెలిపింది. కానీ అదే రోజున కమల్ హాసన్ భారీ ప్రాజెక్ట్ అయిన ఇండియన్ టు కూడా విడుదల కానుంది. అయితే ఇండియన్ టు వాయిదా పడుతుంది అనే వార్తలు రావడంతో ఆ రోజునే రిలీజ్ కి కన్ఫర్మ్ చేసుకున్నారు రాయణ్ చిత్ర బృందం.

ఈ సినిమాలో ధనుష్ చాలా పవర్ ఫుల్ గా కనిపించనున్నారు. సినిమాలో నటిస్తూ దర్శకత్వం చేసుకుంటున్నారు అన్న సంగతి తెలియగానే ఈ సినిమా ఎలా ఉంటుందో అని ప్రేక్షకులలో సినిమా ఎలా ఉంటుందో అనే ఉత్సాహం ఏర్పడింది. ధనుష్ చేసిన ప్రతి సినిమాలో కొత్త కొత్త జోనర్లు ట్రై చేస్తూ కొత్తదనాన్ని వెతుక్కుంటాడు అనే విషయం అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాతో పాటు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర అనే సినిమాలో నటిస్తున్నాడు ధనుష్. ఈ సినిమాలో నాగార్జున కూడా ఉన్నారు.

ఆ కథకి పూర్తి భిన్నంగా రాయణ్ సినిమా ఉండబోతుంది. ఈ సినిమా కోసం అంచనాలు కూడా బానే ఉన్నాయి ఎందుకంటే ధనుష్ 25వ బెంచ్ మార్క్ సినిమా అయిన రఘువరన్ బీటెక్, ఏ రేంజ్ లో హిట్ అయిందో అందరికీ తెలిసిందే. మరి 50వ చిత్రం ఇంకే రేంజ్ లో ఉంటుందా అంటూ టాలీవుడ్ తో పాటు టాలీవుడ్ అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.

Read More: విజయేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా మాత్రు ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్..

ట్రెండింగ్ వార్తలు