చిరంజీవి పద్మ విభీషణ్ పై రామ్ చరణ్ కామెంట్లు.. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా చిరు ఫామిలీ!

May 10, 2024

చిరంజీవి పద్మ విభీషణ్ పై రామ్ చరణ్ కామెంట్లు.. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా చిరు ఫామిలీ!

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమా షూటింగ్ చేస్తున్నారని సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే అత్యంత రెస్పెక్టబుల్ అండ్ ప్రెస్టీజియస్ అవార్డ్ అయిన పద్మ విభూషణ్ చిరంజీవికి వచ్చింది అని గవర్నమెంట్ తెలిపింది.

అయితే ఈ విషయం విన్న తెలుగు ప్రజలు ఎంతో గర్వపడ్డారు. చిరంజీవి కష్టానికి, తను చేసిన సినిమాలకి, తను సినిమా ఫీల్డ్ కి అందించిన సపోర్టుకి పద్మ విభూషణ్ కి చిరంజీవి కచ్చితంగా అర్హుడే అంటూ ఆనందపడ్డారు తెలుగు ప్రేక్షకులు. తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా సినీ ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటీనటులు చిరంజీవికి అభినందనలు తెలుపుతున్నారు.

ఇంక చిరంజీవి కుటుంబ సభ్యులు ఆనందానికైతే అడ్డె లేకుండా పోయింది. తాజాగా ఈ పద్మ విభూషణ్ ని అందుకోవడానికి చిరంజీవి తన సతీమణి సురేఖతో తన కూతురు సుష్మిత తో హాజరయ్యారు. అంతేకాకుండా తన కొడుకు అయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తన భార్య ఉపాసన కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. అయితే ఆ ఈవెంట్ లో తీసుకున్న వీళ్ళ ఫ్యామిలీ ఫోటోని రామ్ చరణ్ తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ “సో ప్రౌడ్ అఫ్ యు నాన్న” అంటూ చిరంజీవిని అభినందించాడు.

ఫ్యామిలీ అంతా ఇలా ఫోటో దిగడంతో ఇది ఒక మంచి మూమెంట్ గా మారింది. మెగా అభిమానులు అందరూ ఈ పోస్ట్ కామెంట్లలో చిరంజీవికి అభినందనలు తెలిపారు. ఈ ఫ్యామిలీ ఫోటో నెట్టింట వైరల్ అవుతూ అందరి దగ్గర మంచి కామెంట్లను తెచ్చుకుంది. అక్కడ జరిగిన ఈవెంట్ లో చిరంజీవి కుటుంబం ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా పైన వర్క్ చేస్తున్నారు. ఈ సినిమా విడుదల దగ్గరలోనే ఉంది. మరోవైపు విశ్వంభర సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు చిరంజీవి.

Read More: కమల్ హాసన్ సినిమా తో క్లాష్ కి దిగిన ధనుష్ సినిమా..

ట్రెండింగ్ వార్తలు