రూట్ మార్చి ఓటీటీలోకి దిగుతున్న రామ్ పోతినేని.. మంచి కం బ్యాక్ ఇస్తాడా?

May 10, 2024

రూట్ మార్చి ఓటీటీలోకి దిగుతున్న రామ్ పోతినేని.. మంచి కం బ్యాక్ ఇస్తాడా?

ఎనెర్జిటిక్ స్టార్ రామ్ గురించి తెలుగు ఇండస్ట్రీలో తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు.యంగ్ హీరోస్ లో అత్యంత టాలెంట్ ఉన్న రామ్ కు మంచి కెరీర్ బిల్డ్ అయింది. యంగ్ ఏజ్ నుంచే మంచి మూవీస్ తీస్తూ రామ్ తన కెరీర్ ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చాడు. కెరీర్ స్టార్టింగ్ లో మంచి మంచి హిట్లు ఉన్నా సరే తర్వాత కొన్ని ప్లాపులతో వెనుకబడ్డ రామ్ ఎప్పటికప్పుడు మంచి కంబాక్స్ ఇస్తూ కాన్స్టంట్ గా నిలిచాడు.

తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇస్మార్ట్ శంకర్ తర్వాత రామ్ కి సరైన హిట్లు ఏమి లేవు. వరుసుగా ఫ్లాపులు రావడంతో రామ్ ఫ్యాన్స్ అందరూ డిసప్పాయింట్ అయ్యారు. అదే సమయంలో డైనమిక్ డైరెక్టర్ అయిన పూరి జగన్నాథ్ తో మళ్లీ డబల్ ఇస్మార్ట్ తీస్తున్నారని వార్తలు రావడంతో అందరూ ఖుషి అయ్యారు. ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా ఉన్న డబల్ ఇష్మార్ట్ మీద అందరికీ ఆశలు పెరుగుతూ వచ్చాయి.

ఎందుకంటే వీళ్ళిద్దరి కాంబోలో ఆల్రెడీ ఇస్మార్ట్ శంకర్ విడుదలై ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో అందరికీ తెలిసిందే. చార్మి, పూరీ జగన్నాథ్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతానికి షూటింగ్ దశ లో ఉంది. అయితే రామ్ కేవలం థియేటర్ రిలీజ్ మీదే కాకుండా ఓటీటీ రిలీజ్ ల మీద కూడా శ్రద్ధ చూపుతున్నాడని వార్తలు వచ్చాయి. డైరెక్ట్ ఓటీటీ లో రిలీజ్ అవుతున్న ఒక ప్రాజెక్టులో రామ్ వర్క్ చేస్తున్నట్టు రూమర్స్ వస్తున్నాయి.

అయితే ఇది తెలుగు సర్కిల్ నుంచి కాదు బాలీవుడ్ సర్కిల్ నుంచి వచ్చిన వార్తలు. అయితే ప్రాజెక్టు గురించి కానీ, తోటి నటీనటుల గురించి కానీ ఇంకెలాంటి వార్తలు రాలేదు. మరి వీటన్నిటి గురించి కన్ఫర్మేషన్ కావాలంటే ఏదైనా అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సిందే. థియేటర్ రిలీజ్ అయినా, ఓటీటీ రిలీజ్ అయినా రామ్ మంచి కం బ్యాక్ ఇస్తే చూడాలని ప్రతి తెలుగు అభిమాని కోరుకుంటున్నాడు.

Read More: బాలీవుడ్ లో రష్మిక కి మరొక బంపర్ ఆఫర్.. ఇంస్టాగ్రామ్ వేదికగా ప్రకటన!

ట్రెండింగ్ వార్తలు