May 10, 2024
శ్రీకాంత్( శ్రీరామ్) ప్రధాన పాత్రలో జాన్ జక్కీ దర్శకత్వంలో రూపొందుతున్న సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీ మాత్రు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రాబోతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. లెజెండరీ స్టోరీ రైటర్ విజయేంద్ర ప్రసాద్ మూవీ ఫస్ట్ లుక్ ని లాంచ్ చేశారు.
ప్రస్తుతం మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కోసం ఫుల్ బిజీగా ఉన్నారు విజయేంద్ర ప్రసాద్. అయినప్పటికీ ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు కూడా తెలిపారు. ప్రధాన తారాగణం అంతా ఇంటెన్స్ లుక్ లో కనిపిస్తున్న థ్రిల్లర్ మూవీ మాతృ ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై చాలా ఆసక్తిని రేపుతుంది. ఈ సినిమాలో సుగి విజయ్, రూపాలి భూషణ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఈ సినిమాకి శేఖర్ చంద్ర మ్యూజిక్ అందిస్తుండగా, రాహుల్ శ్రీవత్సవ డిపిఓగా పనిచేస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో రవి కాలే, పృథ్వీరాజ్, ఆలీ, దేవి ప్రసాద్, ఆమని, నందిని రాయ్ తదితరులు నటిస్తున్నారు. శ్రీ పద్మినీ సినిమాస్ బ్యానర్ పై ఈ సినిమాని బి. శివప్రసాద్ నిర్మిస్తున్నారు. షూటింగ్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేస్తున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. త్వరలోనే మేకర్స్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయబోతున్నారు.
ఇక విజయేంద్ర ప్రసాద్ విషయానికి వస్తే ఆయన సినిమాలలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఈమధ్య రాజకీయాలలో కూడా కొంచెం బిజీ అయ్యారు. కైకలూరులో కూటమి అభ్యర్థి మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ తరఫున, ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ తరపున ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకు తినే కాలకేయులను తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలంటూ పిలుపునిచ్చారు. అలాగే విజయవాడలో సుజనా చౌదరి గెలుపు కోసం కూడా విజయేంద్ర ప్రసాద్ ప్రచారం చేస్తున్నారు.
Here's the First Look poster of #Maathru pic.twitter.com/JssSpS4GDj
— IndiaGlitz Telugu™ (@igtelugu) May 9, 2024
Read More: రూట్ మార్చి ఓటీటీలోకి దిగుతున్న రామ్ పోతినేని.. మంచి కం బ్యాక్ ఇస్తాడా?