100 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన మోహన్ లాల్ భారీ చారిత్రాత్మ‌క చిత్రం ‘మరక్కార్‌’ ట్రైలర్ చూశారా?

December 1, 2021

100 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన మోహన్ లాల్ భారీ చారిత్రాత్మ‌క చిత్రం ‘మరక్కార్‌’ ట్రైలర్ చూశారా?

కమర్షియల్ సినిమాల్లో న‌టిస్తూనే..మరోవైపు కళాత్మక సినిమాలతో ప్రేక్ష‌కుల మ‌న్న‌ల‌నందుకుని జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా ఎదిగారు మోహన్ లాల్. ఆయ‌న‌ కేవ‌లం మలయాళ భాషకే పరిమితం కాలేదు. తమిళం, కన్నడ, తెలుగు, హిందీ భాషల్లో నటిస్తూ ఆయా భాషల్లో ఉన్న ప్రేక్షకుల మనసులు దోచారు. ప్ర‌స్తుతం మోహన్‌లాల్ హీరోగా నటించిన భారీ చారిత్రాత్మ‌క సినిమా ‘మరక్కర్’.

(Marakkar: Arabikadalinte Simham) దాదాపు రూ. 100 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ మూవీ తెరకెక్కింది. పోర్చుగీసు వారికి వ్య‌తిరేఖంగా పోరాడిన 16వ శ‌తాబ్ద‌పు కుజికోడ్‌(కేర‌ళ‌) రాజు కుంజ‌లి మ‌ర‌క్కార్ – 4(మ‌హ‌మ్మ‌ద్‌) (Kunjali Marakkar IV)గా  మోహ‌న్‌లాల్  టైటిల్ రోల్ పోషిస్తుండ‌గా యాక్షన్ కింగ్ అర్జున్, కీర్తి సురేష్‌, మంజు వారియర్, సునీల్ శెట్టి, ప్ర‌భు, అర్జున్ స‌ర్జా, నెడుముడి వేణు, ప్ర‌ణ‌వ్ మోహ‌న్‌లాల్‌, ముఖేష్, సుహాసిని మ‌ణిర‌త్నం, అశోక్ సెల్వ‌న్, క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ తదిత‌రులు ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమాను మోహన్‌లాల్ ప్రాణ మిత్రుడు ప్రియదర్శన్ డైరెక్ట్ చేశారు.

Read More: దర్శకుడు బోయపాటి శ్రీను మౌనానికి కార‌ణం అదేనా..?

ఈ సినిమా విడుదలకు ముందే 67వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో జాతీయ ఉత్తమ చిత్రంతో పాటు బెస్ట్ కాస్ట్యూమ్స్ డిజైన్స్, బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలో నేషనల్ అవార్డ్స్ ను అందుకుంది. దాంతో పాటు 50వ కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్‌లో భాగంగా బెస్ట్ కొరియోగ్రాఫీ, బెస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్, విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో స్పెషల్ జ్యూరీ అవార్డు కైవసం చేసుకుంది.

ఈ సినిమాలో మోహన్‌లాల్‌తో పాటు ఆయన తనయుడు ప్రణవ్ మోహన్‌లాల్ నటించారు. ముందుగా ఈ చిత్రాన్ని 2020 మార్చిలో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అప్పుడు కరోనా కార‌ణంగా ఆల‌స్యం అయింది. తర్వాత ఆగష్టు 12న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. సెకండ్ వేవ్ కార‌ణంగా మ‌రోసారి వాయిదా ప‌డింది.

‘మరక్కర్’ అరేబియా సముద్ర సింహం సినిమాను డిసెంబర్ 2న విడుదల చేస్తున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించారు. తెలుగులో మాత్రం డిసెంబర్ 3న రిలీజైవుతోంది.

తెలుగులోనూ ఈ చిత్రాన్ని అదే పేరుతో విడుద‌ల చేస్తున్నారు నిర్మాత డి. సురేష్ బాబు. సముద్ర సింహం అనేది ఉప శీర్షిక.

ట్రెండింగ్ వార్తలు