July 2, 2022
మంచు మోహన్‌బాబు, మంచు లక్ష్మీ ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్న సినిమాకు ‘అగ్నినక్షత్రం’ అనే టైటిల్ పెట్టారు. అయితే ఈ సినిమాలో హీరోగా మోహన్‌బాబు కాదు. మంచు లక్ష్మీ లీడ్ రోల్ చేసే లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ కాదు.
ఈ సినిమాలో హీరో విశ్వంత్ అట. మలయాళ నటుడు సిద్ధిఖ్ విలన్ అన్నమాట. ఇక సముద్రఖని, చైత్రా శుక్లా కీ రోల్స్ చేస్తున్నారు. పోలీస్‌స్టోరీగా రూపొందుతోన్న ‘అగ్నినక్షత్రం’ సినిమాను మోహన్‌బాబు, మంచులక్ష్మీ నిర్మిస్తున్నారు.
అంతా బాగానే ఉందీ కాని ఈ సినిమాలో విశ్వంత్‌హీరో అయితే…మరి..మోహన్‌బాబు, మంచు లక్ష్మీల రోల్స్ మాట ఏంటీ..అంటే.ఈ విషయాన్ని ఈచిత్రం దర్శకుడు ప్రతీష్ ప్రజోష్ చెప్పాలి. లేదా ఈ సినిమాకు కథ అందిస్తున్న డైమండ్ రత్నబాబు అయిన నోరు విప్పాలి. అప్పటివరకు వెయిట్ చేయక తప్పదు మరి
Read More: కొత్త ట్రెండ్..బయోఫిక్షన్