Nallamala Review: నల్లమల మూవీ రివ్యూ.
March 18, 2022
నటీనటులు: అమిత్ తివారీ, భానుశ్రీ, నాజర్, తనికెళ్ల భరణి, అజయ్ ఘోష్, కాలకేయ ప్రభాకర్, ముక్కు అవినాష్ తదితరులు
కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రవి చరణ్
నిర్మాత: ఆర్ఎమ్
సినిమాటోగ్రఫి: వేణు మురళీధర్. వి
సంగీతం, పాటలు: పీఆర్
ఎడిటర్: శివ సర్వాణి
ఆర్ట్: యాదగిరి
ఫైట్స్: నబా
వీఎఫ్ఎక్స్: విజయ్ రాజ్
పీఆర్వో: దుద్ది శ్రీను, సిద్దు
రిలీజ్ డేట్: 2022-03-18నల్లమల అటవీ ప్రాంతంలో ప్రకృతిని, సాధు జంతువులను ప్రేమించే యువకుడు నల్లమల (అమిత్ తివారి)… తనగూడెం లో నివాసం ఉంటున్న వారికి సహాయం చేస్తుంటాడు. వనమాలి(భాను శ్రీ) అంటే అతనికి ప్రాణం. నల్లమల వద్ద మేలు రకం జాతి ఆవులు ఉంటాయి. అవంటే అతనికి పంచ ప్రాణాలు. అయితే నల్లమల అటవీ ప్రాంతంలో అక్రమ వ్యాపారం చేసేవారికి ఎదురు తిరుగుతాడు. మరి నల్లమల అటవీ ప్రాంతంలో జరిగే అక్రమ వ్యాపారం ఏమిటి? అది ఎందుకు చేస్తున్నారు? గిరిజనుడైన నల్లమల దాన్ని ఎందుకు ఎదిరించాడు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.శాస్త్రవేత్త (నాజర్)ను గిరిజనలు వెంటాడటంతో ఎమోషనల్ నోట్‌తో నల్లమల సినిమా కథ మొదలవుతుంది. ఆ తర్వాత స్కూల్ పిల్లలకు ఎలాంటి అంశాలతో పాఠ్యాంశాన్ని పుస్తకంలో చేర్చాలనే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో కథ ఆసక్తిని కలిగిస్తుంది. ఇక మాజీ నక్సలైట్ (చత్రపతి శేఖర్) చెప్పే ఫ్లాష్ బ్యాక్‌తో ఫీల్ గుడ్ నోట్‌తో కథలోకి వెళ్తాం. ఆవు చుట్టూ తిరిగే భావోద్వేగమైన పాయింట్‌ను దర్శకుడు తీర్చిదిద్దిన విధానం చక్కగా కుదిరింది. మొదటి సినిమా అయినా ఎక్కడా ఆ ఫీలింగ్ కలగదు. ఒక అనుభవజ్ఞుడైన దర్శకుడిలా మంచి ప్రతిభను కనబరిచారు. ఫస్ట్ సినిమాకే నల్లమల లాంటి భలమైన కథను ఎంచుకోవడం పరిశ్రమ పట్ల దర్శకుడి ఆసక్తి తెలుస్తుంది.నటీనటులు ఫెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. అమిత్ తివారీ హీరోగా ఎంచుకొన్న కథ బాగుంది. అన్ని రకాల ఎమోషన్స్ పండించే ఆస్కారం దొరికింది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలలో అమిత్ అదరగొట్టాడు. భాను శ్రీ గ్లామర్ పరంగా, డ్యాన్సుల పరంగా ఆకట్టుకొంది. కొన్ని సీన్లలో భాను శ్రీ నటన, స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది. అజయ్ ఘోష్, కాలకేయ ప్రభాకర్, నాజర్, తనికెళ్ల భరణి పాత్రలు చక్కగా కుదిరాయి.ఇక సాంకేతిక అంశాలకు వస్తే.. నల్లమల సినిమాకు బ్యాక్ గ్రౌండ్, సినిమాటోగ్రఫి స్కోర్ ప్రత్యేక ఆకర్షణ. బీజీఎంతో కొన్ని సీన్లు బాగా ఎలివేట్ అయ్యాయి. యాక్షన్ సీన్లు, అటవీ అందాలను సినిమాటోగ్రాఫర్ వేణు మురళీ తన కెమెరాలో చక్కగా బంధించాడు. సిద్ శ్రీరామ్ పాడిన ఏమున్నావే పిల్ల పాట ఆడియో పరంగా ప్రేక్షకులను ఆకట్టుకొన్నది. తెర మీద కూడ అంతే ఎఫెక్టివ్‌గా కనిపించింది.ఓవరాల్‌గా నల్లమల సినిమా విషయానికి వస్తే.. అటవీ ప్రాంతంలో జరిగే అన్యాయాలు, వాటిని ఎదురించిన గిరిజన యువకుడి కథగా రూపొందింది. కథ, కథనాలు గ్రామీణ వాతావరణం, నేటివిటి సినిమాలను ఆదరించే వారికి ఈ సినిమా మరింత బాగా నచ్చుతుంది.