July 3, 2022
గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందిన సినిమా పక్కా కమర్షియల్. రాశీఖన్నా హీరోయిన్. రావురమేష్ విలన్‌గా చేశారు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం జూలై 1న రిలీజైంది. అయితే రిలీజ్ రోజు నుంచే ఈ సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చింది. ఇక కలెక్షన్స్ విషయంలోనూ పక్కాగా తప్పుడు లెక్కలు చెబుతోంది చిత్ర యూనిట్. ఇండస్ట్రీలో తప్పుడు కలెక్షన్స్ మామూలే. కానీ మరి ఇంత దారుణంగా. కాదు.. పక్కా కమర్షియల్ సినిమాకు తొలిరోజు దాదాపు 6.3 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయని చిత్రయూనిట్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది.
నిజానికి ఫస్ట్ డే అందులో సగం కలెక్షన్లు కూడా రాలేదని తెలుస్తోంది. అంతటితో ఆగకుండా అసలు 10శాతం కూడా ఆక్యుపెన్సీ లేని రెండో రోజు ఏకంగా 4.2 కోట్లు వచ్చాయని మరో పోస్టర్ వదిలింది. సాధారణంగానే గీతా ఆర్ట్స్, మైత్రీ మూవీస్ సంస్థలు చెప్పే కలెక్షన్ల లెక్కలు…పోస్టర్లు పై ఎప్పటినుంచో వివాదం నెలకొనిఉంది. ఇప్పుడు పక్కా కమర్షియల్ సినిమాతో మరోసారి రుజువైంది. ఇందులో 4 -5 కోట్ల రూపాయల్ని అదనంగా కలిపింది నిర్మాణసంస్థ. గీతా ఆర్ట్స్ కలెక్షన్స్ పోస్టర్సా..మజాకా