నా ఫోన్ హ్యాక్ అయింది.. మానసికంగా చాలా బాధపడుతున్నా.. ఎమోషనల్ పోస్ట్ చేసిన నటి?

May 8, 2024

నా ఫోన్ హ్యాక్ అయింది.. మానసికంగా చాలా బాధపడుతున్నా.. ఎమోషనల్ పోస్ట్ చేసిన నటి?

ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు బాగా పెరిగిపోయాయి. ఈ సైబర్ నేరాల బారిన కేవలం సామాణులు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు కూడా పడుతున్నారు. ఇటీవల చాలామంది సెలబ్రిటీలు ఫోన్ హ్యాక్ అయిందని సైబర్ నేరగాళ్ళు మోసం చేశారు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా కూడా ఒక నటి తన ఫోన్ హ్యాక్ అయిందంటూ పోస్ట్ చేసింది. ఆమె మరెవరో కాదు పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన దేవియని శర్మ ఇటీవల షైతాన్, సేవ్ ది టైగర్స్ సిరీస్ లతో మెప్పించి ఫుల్ పాపులర్ అయింది.

ఇక సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫోటోషూట్స్ తో అలరిస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే తాజాగా దేవియని శర్మ తన ఫోన్ హ్యాక్ అయిందంటూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. దేవియని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో కొన్ని రోజుల క్రితం నా ఫోన్ హ్యాక్ అయింది. నా పర్సనల్ ఇన్ఫర్మేషన్ తో నన్ను బ్లాక్ మెయిల్ చేశారు. భయపెట్టాలని చూశారు. ఏ ఉద్దేశంతో చేస్తున్నారో నాకు తెలీదు కానీ, ఈ విషయాన్ని ఇప్పుడు బయటపెడుతున్నాను. ఇప్పుడు మళ్ళీ నా ఫోన్ లో కొన్ని మార్పులు కనిపిస్తున్నాయి.

నా వాట్సాప్ హ్యాక్ అయిందని నాకు అనిపిస్తుంది. ఒకవేళ నా నంబర్ నుచి ఎవరికైనా ఎలాంటి మెసేజ్ వచ్చినా అది నాది కాదు. ఇప్పటికే దీంతో మానసికంగా బాధపడుతున్నాను. మూడు సార్లు ముంబై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాను. నేను వ్యవస్థలను నమ్ముతాను. కేసుని ముందుకు తీసుకెళ్తాను. కాబట్టి నా నంబర్ నుంచి ఎలాంటి మెసేజ్ లు వచ్చినా అది నేను కాదు అని తెలుసుకోండి. వీలైనంత త్వరగా ఈ సమస్యని పరిష్కరించడానికి ప్రయత్నిస్తాను. ఇది నా పరువు తీయడానికి, నన్ను చెడుగా ప్రమోట్ చేయడానికే చేస్తున్నట్టు ఉంది అని రాసుకొచ్చింది దేవియని.

Read More: మీ భవిష్యత్తు కోసం పాటుపడే నాయకుడు… బాబాయ్ ను గెలిపించండి: రాంచరణ్

Related News

ట్రెండింగ్ వార్తలు