ప్రభాస్ కల్కి మూవీలో మహేష్ బాబు నటిస్తున్నారా.. ఇందులో నిజమెంత?

May 8, 2024

ప్రభాస్ కల్కి మూవీలో మహేష్ బాబు నటిస్తున్నారా.. ఇందులో నిజమెంత?

టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజాగా సలార్‌ తో పలకరించిన విషయం తెలిసిందే. గత ఏడాది డిసెంబర్ 22న విడుదల అయిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలై సూపర్ హిట్ ను అందుకుంది. కాగా ఈ సినిమాకు కెజీయఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఈ సినిమా 650 కోట్ల వరకు గ్రాస్ అందుకుంది. ఈ సినిమా తర్వాత ప్రస్తుతం ప్రభాస్ కల్కి సినిమా చేస్తున్నారు ప్రభాస్. సైన్స్ ఫిక్షన్ జానర్‌లో వస్తున్న కల్కి 2898 ఏడి సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో దీపికా పదుకొనె హీరోయిన్‌గా నటిస్తున్నారు. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్స్ కీలకపాత్రలో నటిస్తున్నారు. కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు టీజర్లు ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేశారు. ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పటికే సగం షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఈ మూవీ మే 9న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే విఎఫ్ఎక్స్ వర్క్ బ్యాలన్స్ ఉన్న కారణంగా మూవీని జూన్ 27న విడుదల చేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది టీమ్.

ఈ విషయంలో ఒక పోస్టర్‌తో అధికారిక ప్రకటన విడుదలైంది. అది అలా ఉంటే ఈ సినిమా విషయంలో ఒక ఖతర్నాక్ అప్ డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేమిటంటే సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా కీలకపాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఆయన పాత్ర అనేది వాయిస్ రూపంలో ఉంటుందట. కల్కీలో విష్ణు అవతారానికి మహేష్ బావు వాయిస్ ఓవర్ అందిస్తాడని అంటున్నారు. అంతేకాదు మహేష్ ఒక పాత్రలో కూడా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ వార్తల్లో నిజానిజాల సంగతి పక్కన పెడితే ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాలో ప్రభాస్ నందీశ్వరుడిగా కనిపించనున్నారట. శివుడి వాహానం నంది అని తెలిసిందే. నంది శివుని సేవకుడిగా, కైలాస లోక సేనలకు అధిపతిగా కూడా ఉంటాడు. అలా ఈ సినిమాలో ఆయన అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్‌కు సహాయకుడిగా ఉంటారట.

Read More: నా ఫోన్ హ్యాక్ అయింది.. మానసికంగా చాలా బాధపడుతున్నా.. ఎమోషనల్ పోస్ట్ చేసిన నటి?

ట్రెండింగ్ వార్తలు