May 8, 2024
టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శక ధీరుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా కంటే ముందుగా ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చినటువంటి ఆర్ఆర్ఆర్ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్టైన్ చేసింది. ఇక ఈ సినిమాకు ఏకంగా ఆస్కార్ అవార్డు రావడం అంటే మామూలు విషయం కాదని చెప్పాలి.
ఇలా ఆస్కార్ అవార్డును అందుకోవడంతో తెలుగు సినిమా పేరు ప్రఖ్యాతలు అంతర్జాతీయ స్థాయిలో మారుమోగిపోతున్నాయి. ఇకపోతే ఇటీవల రాజమౌళి బాహుబలి యానిమేటెడ్ సిరీస్ ని ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. క్రౌన్ ఆఫ్ బ్లడ్ పేరిట బాహుబలి యానిమేట్ సిరీస్ లు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయని తెలియజేశారు. ఈ సందర్భంగా ఈ ప్రమోషన్లలో భాగంగా ఇటీవల ప్రెస్ మీట్ లో రాజమౌళి పాల్గొన్నారు.
ఈ ప్రెస్ మీట్ లో భాగంగా రాజమౌళి పట్ల విలేకరులు కాస్త ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకంగా ఐదు గంటల పాటు ఈయన ఆలస్యంగా రావడంతో రిపోర్టర్స్ అసహనం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో భాగంగా రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇందులో ఎన్టీఆర్ రామ్ చరణ్ నటించిన ఎన్టీఆర్ పాత్రను తక్కువ చేసి రామ్ చరణ్ పాత్రను హైలెట్ చేశారు అంటూ మొదటి నుంచి కూడా అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఇదే ప్రశ్న రిపోర్టర్ రాజమౌళిని ప్రశ్నించారు అలా ఎందుకు ఒక హీరోనే ఎలివేట్ చేసి మరొక హీరో పాత్రను తగ్గించారు అంటూ ప్రశ్నించడంతో ఈ ప్రశ్నకు రాజమౌళి సమాధానం చెబుతూ ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ఇది సరైన సందర్భం కాదు అంటూ సమాధానం చెప్పకుండా దాటవేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read More: నాకు ఆయన అంటే ఇష్టం నా ఓటు అతనికే.. జనం నేను వేయమంటే వేయరుగా: యాంకర్ రవి