పుష్ప సినిమా వల్ల నాకు ఒరిగింది ఏమీ లేదు.. ఫహద్ ఫాసిల్!

May 8, 2024

పుష్ప సినిమా వల్ల నాకు ఒరిగింది ఏమీ లేదు.. ఫహద్ ఫాసిల్!

డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించినటువంటి చిత్రం పుష్పం ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి సంచలనాలను సృష్టించిందో మనకు తెలిసిందే. ఈ సినిమాలో నటించిన నటీనటులు అందరూ కూడా పాన్ ఇండియా స్థాయిలో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక పుష్ప సినిమా క్లైమాక్స్ లో ఎస్పీ భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో నటుడు ఫాసిల్ నటించిన సంగతి తెలిసిందే.

ఒకటి తక్కువ అయింది పుష్ప అంటూ తన నటనతో ప్రేక్షకులందరినీ మెప్పించారు. ఇక ఈ సినిమా ద్వారా మలయాల నటుడు అయినటువంటి ఈయనకు తెలుగులో కూడా ఎంతో మంచి ఆదరణ లభించింది అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన పుష్ప సినిమా గురించి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ ప్రశ్నిస్తూ..

పుష్ప సినిమా తర్వాత పాన్ ఇండియా హీరోగా మారారు అనే కాంప్లిమెంట్స్ వస్తున్నాయి కదా ఈ కాంప్లిమెంట్స్ పై మీ స్పందన ఏంటి అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ.. పుష్ప సినిమా నా కెరియర్ కు పెద్దగా ఉపయోగపడలేదని తెలిపారు ఈ సినిమా వల్ల నాకు ఎలాంటి లాభాలు కూడా లేవని ఈయన వెల్లడించారు. ఇదే విషయాన్ని తాను సుకుమార్ గారికి కూడా చెప్పానని ఇందులో నిజం దాల్చాల్సిన అవసరం ఏమాత్రం లేదని తెలిపారు.

పుష్ప సినిమా తర్వాత నేను చాలా మలయాళ సినిమాలలో నటించాను. అయితే భాష తెలియకపోయినా ఆ సినిమాలను కూడా అందరూ చూస్తున్నారు. ఇదొక్కటే నాకు చాలా సంతోషం కలిగించిందని ఈయన తెలియజేశారు. నేను ఏ ప్రాంతాన్ని ఎవరిని అగౌరవ పరచలేదంటూ ఈ సందర్భంగా ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి అయితే పుష్ప సినిమాతో ఈయన పాన్ ఇండియా సొంతం చేసుకోలేదని తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారని స్పష్టంగా తెలుస్తోంది.

Read More: ఆర్ఆర్ఆర్ సినిమా పై ప్రశ్న వేసిన రిపోర్టర్.. జవాబు దాటవేసిన జక్కన్న?

ట్రెండింగ్ వార్తలు