బాలయ్య బాబు మూవీ విషయంలో ఆ డైరెక్టర్ హర్ట్ అయ్యారా.. నమ్మి మోసపోవడం నా తప్పే అంటూ!

May 8, 2024

బాలయ్య బాబు మూవీ విషయంలో ఆ డైరెక్టర్ హర్ట్ అయ్యారా.. నమ్మి మోసపోవడం నా తప్పే అంటూ!

టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలకృష్ణ ప్రస్తుతం వరుసగా సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ వయసులో కూడా అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ వరుస విజయాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు. వరుసగా మూడు సినిమాలు అవ్వడంతో హ్యాట్రిక్ కొట్టారు బాలయ్య బాబు. ఇది ఇలా ఉంటే ఇదివరకు బాలయ్య బాబు సరైన హిట్టు లేక సతమతమవుతున్న సమయంలో అనగా లక్ష్మి నరసింహ తర్వాత బాలయ్యకి దాదాపు ఆరేళ్ళ పాటు సరైన హిట్ లేదు.

బాలయ్య మార్కెట్ దెబ్బ తింటోంది అనుకున్న తరుణంలో వచ్చిన చిత్రం సింహా. సింహా చిత్రమే బాలయ్య కెరీర్ కి తిరిగి ఊపిరి పోసింది. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాలయ్యకి కొత్త జోష్ ఇచ్చింది. బాలయ్య ఎలా కనిపిస్తే ఫ్యాన్స్ పండగ చేసుకుంటారో అంతే పవర్ ఫుల్ గా బోయపాటి ప్రజెంట్ చేశారు. బాలయ్య డ్యూయెల్ రోల్ లో నటించిన ఈ చిత్రంలో నయనతార, స్నేహ ఉల్లాల్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి దర్శకుడు బోయపాటి అయినప్పటికీ రచయితగా కొరటాల శివ పాత్ర ఎంతైనా ఉంది. అప్పటికి కొరటాల ఇంకా డైరెక్టర్ కాలేదు. కొరటాల శివ అందించిన కథ, మాటలు ఈ చిత్రానికి ఎంతో ప్లస్ అయ్యాయి.

కొరటాల శివ, బోయపాటి ఇద్దరూ పోసాని కృష్ణమురళి శిష్యులే. ఇప్పుడు వీళ్ళిద్దరూ టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్లుగా రాణిస్తున్నారు. అయితే సింహా చిత్రం విషయంలో వీళ్లిద్దరి మధ్య వివాదం జరిగిందట. ఒక ఇంటర్వ్యూలో కొరటాల శివ ఈ అంశం గురించి సున్నితంగా స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. అది జరిగి పోయిన విషయం. ఇప్పుడు అందరం బావున్నాము. స్టోరీ, డైలాగ్స్ క్రెడిట్ విషయంలోనేనా గొడవ అని ప్రశ్నించగా.. నమ్మి మోసపోవడం మనదే తప్పు. అయితే ఇప్పుడు నేను ఎవరిని రెచ్చగొట్టాలని అనుకోవడం లేదు. కానీ ఎక్కడో తప్పు మాత్రం జరిగింది. నేను మనస్థాపం చెందిన మాట వాస్తవం. నమ్మి మోసపోవడం చాలా మంది జీవితాల్లో జరుగుతూ ఉంటుంది. నాక్కూడా జరిగింది. అది ఒక ఎక్స్ పీరియన్స్. జీవితంలో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి అని కొరటాల చెప్పుకోచ్చారు.

Read More: ప్రభాస్ కల్కి మూవీలో మహేష్ బాబు నటిస్తున్నారా.. ఇందులో నిజమెంత?

ట్రెండింగ్ వార్తలు