మీ భవిష్యత్తు కోసం పాటుపడే నాయకుడు… బాబాయ్ ను గెలిపించండి: రాంచరణ్

May 8, 2024

మీ భవిష్యత్తు కోసం పాటుపడే నాయకుడు… బాబాయ్ ను గెలిపించండి: రాంచరణ్

జనసేన అధినేత సినీ నటుడు పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గం మొత్తం సెలబ్రిటీల రాకతో కలకలలాడుతోంది. ఇలా పిఠాపురానికి పెద్ద ఎత్తున సెలెబ్రెటీలు అందరూ చేరుకొని పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోని మెగా హీరోలు కూడా ఇప్పటికే పిఠాపురం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పర్యటనలు చేశారు.

ఈ విధంగా పవన్ కళ్యాణ్ కు రోజు రోజుకు సినీ సెలబ్రిటీల మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే పలువురు మెగా హీరోలు పిఠాపురంలో పర్యటనలు చేసి పవన్ కళ్యాణ్ ని గెలిపించాలని కోరారు. అయితే ఇటీవల మెగాస్టార్ చిరంజీవి సైతం సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ ని గెలిపించాలి అంటూ పిఠాపురం నియోజకవర్గం ప్రజలు అందరినీ కోరిన సంగతి మనకు తెలిసిందే.

ఇలా చిరంజీవి మాత్రమే కాకుండా ఇండస్ట్రీలో పలువురు యంగ్ హీరోలు అందరూ కూడా పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలియజేస్తూ ఆయన గెలవాలని కోరారు. అయితే తాజాగా తన బాబాయ్ కోసం అబ్బాయి కూడా రంగంలోకి దిగారు. రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా తన బాబాయ్ పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలియజేస్తూ చేసినటువంటి పోస్ట్ వైరల్ అవుతుంది.

ఈ సందర్భంగా రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. మీ భవిష్యత్తు కోసం పాటుపడే నాయకుడిని గెలిపించండి అంటూ తన బాబాయ్ కి మద్దతు తెలియజేశారు. ఇలా పవన్ కళ్యాణ్ ని గెలిపించాలి అంటూ రాంచరణ్ సోషల్ మీడియా వేదికగా చేస్తున్నటువంటి ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇలా ఎంతోమంది సినీ సెలబ్రిటీల మద్దతుతో పవన్ కళ్యాణ్ ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు. మరి ఈయన ఎన్నికలలో ఎలాంటి విజయం అందుకుంటారు. ప్రజలు ఎవరికి పట్టం కడతారు అనేది తెలియాల్సి ఉంది.

Read More: పుష్ప సినిమా వల్ల నాకు ఒరిగింది ఏమీ లేదు.. ఫహద్ ఫాసిల్!

Related News

ట్రెండింగ్ వార్తలు