ఫిలిం ఛాంబ‌ర్ మాట నిల‌బెట్టుకోవాల‌ని విజ్ఞప్తి చేస్తున్నాం – పీపుల్ మీడియా ఫ్యాక్టరీ

January 19, 2024

ఫిలిం ఛాంబ‌ర్ మాట నిల‌బెట్టుకోవాల‌ని విజ్ఞప్తి చేస్తున్నాం – పీపుల్ మీడియా ఫ్యాక్టరీ

రవితేజ హీరోగా నటించిన ‘ఈగల్‌’ సినిమా సంక్రాంతికే రావాల్సి ఉంది. కానీ సంక్రాంతి సినిమాలు ఎవ్వ‌రూ త‌గ్గ‌క‌పోవ‌డంతో థియేట‌ర్స్‌ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని సోలో రిలీజ్ డేట్ ఇస్తాం అని ఫిలిం చాంబ‌ర్ పెద్ద‌లు రిక్వెస్ట్ చేయగా ఈగల్ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, రవితేజ ఇందుకు ఒప్పుకున్నారు. దీంతో ఈగల్ సినిమాని ఫిబ్రవరి 9కి వాయిదా వేశారు. కానీ ఇప్పుడు అదే డేట్ కి మళ్ళీ పలు సినిమాలు క్యూ కడుతున్నాయి. ఫిబ్రవరి 8న మ‌హి వి రాఘ‌వ‌ యాత్ర 2, ఫిబ్రవరి 9న‌ సందీప్ కిష‌న్ ఊరు పేరు భైరవకోన, ర‌జినికాంత్ లాల్ సలామ్ డబ్బింగ్ రిలీజ్.. లు వచ్చాయి. మ‌రికొన్ని చిన్న‌ సినిమాలు కూడా అదే డేట్ కి వచ్చేలా ఉన్నాయి. దీంతో రవితేజ ఈగల్ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ విషయంపై తెలుగు ఫిలిం ఛాంబర్ కి లేఖ రాశారు.

ఈగల్ నిర్మాణ సంస్థ ఈ లేఖలో.. సంక్రాంతికి రావాల్సిన ఈగల్ సినిమా ఛాంబర్ పెద్దల నిర్ణయం మేరకు, సినీ పరిశ్రమ మంచి కోసం మేము వాయిదా వేసుకున్నాం. అందుకు మా సినిమాకి సోలో రిలీజ్ డేట్ ఇప్పిస్తామన్నారు. కానీ మా సినిమా రిలీజ్ రోజే మరిన్ని సినిమాలు విడుదలకు రెడీ అయ్యాయి. ఈగల్ సినిమాకి సోలో డేట్ ఇస్తామన్న మాట నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈగల్ సినిమా సోలోగా విడుదలయ్యేలా సహకరించాలని ఛాంబర్ ను కోరుతున్నాం అని రాశారు. మ‌రి చూడాలి ఈ విష‌యంలో ఫిలిం చాంబ‌ర్ జోక్యం చేసుకుని స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తుందో లేదో!

కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటించారు. People Media Factory

Read More: OoruPeruBhairavaKona Tailer: భైర‌వ‌కోన‌లో ఏం జ‌రిగింది?

ట్రెండింగ్ వార్తలు