పోస్ట‌ర్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్‌

November 20, 2021

పోస్ట‌ర్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్‌
సినిమా పేరు: పోస్ట‌ర్‌ విడుద‌ల తేది: 19-11-2021 నటీనటులు: విజయ్ ధరన్, రాశి సింగ్, అక్షత సోనావానే, శివాజీ రాజా, మధుమణి, కాశి విశ్వనాధ్, రామరాజు, తదితరులు. రచన – దర్శకత్వం: టి ఎమ్ ఆర్ నిర్మాతలు: టి మహిపాల్ రెడ్డి, శేఖర్ రెడ్డి, ఏ గంగా రెడ్డి, ఐ జి రెడ్డి. ఎడిటింగ్: మార్తాండ్‌ కె వెంకటేష్ కెమెరా: రాహుల్ సంగీతం: శాండీ అద్దంకి సినీ పరిశ్ర‌మ‌లో పోస్ట‌ర్ అనే ప‌దానికి ఎంత‌టి ప్రాధాన్య‌త ఉంటుందో అంద‌రికీ తెలిసిందే..అలాంటి ఒక క్యాచీ టైటిల్‌తో కొత్త ద‌ర్శ‌కుడు, నూత‌న న‌టీన‌టులు పరిచ‌య‌మ‌వుతున్న చిత్రం పోస్ట‌ర్‌. విజయ్‌ ధరన్ హీరోగా రాశిసింగ్‌, అక్షత సోనావానే హీరోయిన్లుగా నటించారు. కేవ‌లం ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌తోనే యూత్ ఆడియ‌న్స్ దృష్టి త‌మవైపు తిప్పుకున్న ఈ సినిమా టీజ‌ర్ ట్రైల‌ర్‌కి కూడా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ శుక్రవారం(నవంబర్‌ 19)న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.. కథః తెలంగాణ‌లోని సిద్దిపేటకి చెందిన శ్రీను(విజయ్‌ ధరన్‌) ఆవారాగా తిరుగుతూ ఫ్రెండ్స్ తో లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. తన తండ్రి పనిచేస్తున్న ఒక థియేటర్ ఓనర్ పెద్దారెడ్డి కూతురు మేఘన(అక్షత)తో మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. పెద్దారెడ్డి..శ్రీనులోని ధైర్యసాహసాలు నచ్చి తన దగ్గరే పనిలో పెట్టుకుని అతనితో సెటిల్మెంట్స్ చేయిస్తుంటాడు. ఆ త‌ర్వాత వీళ్ల ప్రేమ‌ విషయం తెలుసుకున్నపెద్దారెడ్డి తన మనుషులతో శ్రీ‌ను ఇంటిపై దాడి చేయిస్తాడు. ఆ ఊర్లో వాళ్ల ఎదుట శ్రీను, అత‌డి తల్లిదండ్రుల పరువు తీస్తాడు పెద్దారెడ్డి. దీంతో అవమానంగా ఫీలైన తండ్రి శ్రీ‌నుని ఇంటి నుండి బయటకు గెంటేస్తాడు. అలా బయటకు వెళ్లిన శ్రీను లైఫ్ ఎలా మారిపోయింది? మరి మేఘనతో శ్రీను ప్రేమకథ ఏ టర్న్ తీసుకుంది? జీరో లాగా ఇంటి నుండి బయటకు వెళ్లిన శ్రీను హీరోలా ఎలా వచ్చాడు అనేది మిగతా కథ. విశ్లేషణః నిజానికి విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఇలాంటి కథతో చాలా సినిమాలొచ్చాయి. చాలా వరకు సక్సెస్‌ సాధించాయి. దాన్నినేటి తరానికి కనెక్ట్ అయ్యేలా కొత్తగా తీర్చిదిద్దడంలోనే దర్శకుడి ప్రతిభ ఆధారపడి ఉంటుంది. `పోస్టర్‌` సినిమా విషయంలో దర్శకుడు టి మహిపాల్‌ రెడ్డి ఆ జాగ్రత్తలు తీసుకోవడంలో సక్సెస్ అయ్యాడు. అన్ని వర్గాల ఆడియెన్స్ ని ఆకట్టుకునేలా ఈ కథని తీర్చిదిద్దాడు. సినిమాలోని అసలు ఫ్లాట్‌ని ఓపెన్ చేయకుండా ఆ సస్పెన్స్ ని దాస్తూ యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో మలిచిన తీరు ఆకట్టుకుంటుంది. సినిమాని ఫుల్ ఎంటర్‌టైనింగ్‌గా తీసుకెళ్లారు. తండ్రి కొడుకుల బాండింగ్, కొడుకు భవిష్యత్తు కోసం తండ్రి పడే తపన, విలేజ్ నేటివిటీ, లవ్, డ్రామా, సాంగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇంటర్వెల్ పార్ట్ కొత్తగా ఉంది. క్లైమాక్స్ సినిమాకి హైలైట్. విలేజ్‌ బ్యాక్‌ డ్రాప్‌, లవ్‌ ట్రాక్‌ యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ కి కూడా ఆకట్టుకుంటాయి. నటీనటుల పనితీరు: శ్రీనుగా హీరో విజయ్‌ధరన్ తొలిసినిమాతోనే ఇంటెన్స్ పెర్‌ఫామెన్స్‌తో మెప్పించాడు. సినిమాని రక్తికట్టించడంలో ప్ర‌ధాన పాత్ర పోషించాడు. మొదటి భాగంతో పోల్చితే సెకండాఫ్‌లో మరింత మెచ్యూర్డ్ గా క‌నిపించాడు. నటుడిగా అతనికి మంచి భవిష్యత్‌ ఉంటుంది. రాశి సింగ్ పక్కింటి అమ్మాయిలా ఆకట్టుకుంది. మరో హీరోయిన్ అక్షత సోనావానే అటు గ్లామర్ గాళ్ అండ్ మోడ్రన్ విలేజ్ అమ్మాయి లుక్ లో కుర్రకారుని అలరించింది. సినిమాతో పాటు యూత్ ఆడియ‌న్స్‌కు గ్లామర్ ట్రీట్‌నిచ్చింది. హీరో తండ్రిగా శివాజీరాజా సెటిల్డ్ గా పెర్‌ఫామ్ చేశారు. పెద్దిరెడ్డిగా రామరాజు విలనిజం బాగుంది. హీరో ఫ్రెండ్స్ గా రవీందర్ మంచి పాత్ర‌లో క‌నిపించారు. మహిపాల్‌ రెడ్డికి దర్శకుడిగా తొలి సినిమా కావ‌డంతో ఫుల్ ఎఫ‌ర్ట్ పెట్టార‌ని తెలుస్తోంది. త‌న క‌ష్టం స్క్రీన్ మీద క‌నిపిస్తుంది. అన్ని వ‌ర్గాల ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యేలా, తాను చెప్పాలనుకున్నది క్లారిటీగా చెప్పాడు. ఎక్క‌డా కొత్త ద‌ర్శ‌కుడు అనిపించ‌దు. ఈ కథకు, అంతర్లీనంగా ప్రస్తుత సమాజంలో అందరికి కావాల్సిన ఒక సందేశాన్ని కూడా ఇవ్వ‌డం విశేషం. శాండీ అద్దంకి పాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్ర‌తి ఫ్రేమ్ చాలా రిచ్‌గా తెరకెక్కించారు. మార్తాండ్ కె వెంకటేష్ త‌న క‌త్తెర‌కు ఇంకాస్త ప‌దునుపెట్టాల్సింది. రాహుల్ విజువల్ క‌థ‌కి త‌గ్గ‌ట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయంట్స్‌: హీరో విజ‌య్ ధ‌ర‌న్ ఫెర్‌ఫామెన్స్‌..క్యాస్టింగ్‌ అంత‌ర్లీనంగా మంచి సందేశం బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ మైనస్ పాయంట్స్‌ స్లో నెరేషన్‌ నిడివి బాట‌మ్‌లైన్‌: పోస్ట‌రంత బాగుంటుంది సినిమా రేటింగ్‌-2.75

Related News

ట్రెండింగ్ వార్తలు