August 24, 2022
రాజశేఖర్ హీరోగా పవన్ సాధినేని దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త సినిమాకు మాన్‌స్టర్ అనే టైటిల్ ఖరారు చేశారు. గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. కానీ ఇదే టైటిల్‌తో మరో రెండు సినిమాలు సెట్స్‌పై ఉండటం విశేషం. తెలుగులోనే వంశీ చాగంటి, ప్రియదర్శి, కౌటిల్య, కళ్యాణ్ ప్రధాన పాత్రలు చేస్తున్న సినిమా ‘మాన్‌స్టర్’ అనే టైటిల్‌తోనే తెరకెక్కుతోంది. ఈ సినిమాకు ఐతరాజువేద్ దర్శకుడు. ఇటు మలయాళంలో మోహన్‌లాల్, మంచు లక్ష్మీ ప్రధాన పాత్రల్లో సేమ్ టైటిల్ అంటే మాన్‌స్టర్ అనే టైటిల్‌తోనే ఓ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు విశాఖ్ దర్శకుడు. మరి…ఈ ముగ్గురిలో ఎవరు అసలైన మాన్‌స్టర్‌నో ఆడియన్స్ కలెక్షన్స్ రూపంలో నిర్ణయిస్తారు. అలాగే ఈ ముగ్గిరిలో ఎవరో ఒకరు టైటిల్ మార్చుకున్నా ఆశ్చర్యం లేదు. లేకపోతే రిలీజ్‌లు డిఫరెంట్ టైమ్స్‌లో ఉంటే అసలు గొడవే లేదు.
ఇటు నాగార్జున హీరోగా నటించిన తాజా చిత్రంకు ‘ది ఘోస్ట్’ అనే టైటిల్ ఉంది. కన్నడంలో ఘోస్ట్‌లో టైటిల్‌తో శివరాజ్‌కుమార్ ఓ సినిమా చేస్తున్నారు. సేమ్ కన్నడంలో దసరా అనే సినిమా రూపొందుతుంది.. నాని లేటెస్ట్ ఫిల్మ్ ‘దసరా’ అన్న సంగతి తెలిసిందే. ఇలా మరికొన్ని సినిమాలు అదే పేరుతో వివిధ భాషలలో నిర్మాణ దశలలో ఉన్నాయి. మరి చూడాలి ఎవరు ఏ టైటిల్ తో ప్రేక్షకులముందుకు వస్తారో..