August 30, 2022
‘విక్రమ్’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చి మంచి జోరుమీదున్న దర్శకుడు లోకేష్ కనగరాజ్ నెక్ట్స్ ఫిల్మ్ విజయ్‌తో రూపొందనుంది. మాస్టర్ (2021) తర్వాత హీరో విజయ్‌తో లోకేష్ చేస్తున్న సినిమా ఇది. గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమాలో ఆరుగురు విలన్స్, ఇద్దరు హీరోయిన్స్ ఉంటా రు. ఇప్పటికే హీరోయిన్స్‌గా త్రిష, సమంత లేటెస్ట్‌గా కీర్తీ సురేశ్ పేర్లు తెరపైకి వచ్చాయి.
హీరోయిన్స్‌పై మాత్రమే కాదు. క్యారెక్టర్ ఆర్టిస్టుల ఎంపికపై కూడా లోకేష్ వర్క్ స్టార్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో మోహన్‌లాల్ ఓ కీ రోల్ చేయనున్నారు. ఆల్రెడీ లోకేష్ కనగరాజ్‌ను సోషల్‌మీడియాలో మోహన్ లాల్ ఫాలో అవుతుండటం స్టార్ట్ చేయడం అనేది ఇందులో మోహన్‌లాల్ కీ రోల్ చేయడానికి ఒప్పుకున్నారు అనడానికి ఓ నిదర్శనంగా అని ఫీలవుతున్నారు విజయ్ ఫ్యాన్స్. ఒకవేళ మోహన్‌లాల్, విజయ్ కలిసి నటిస్తే దాదాపు 8 సంవత్సరాల తర్వాత విజయ్, మోహన్‌లాల్ స్క్రీన్ షేర్ చేసుకున్నట్లవుతుంది. గతంలో ఆర్‌టీ నీసన్ దర్శకత్వంలో రూపొందిన ‘జిల్లా’ లో విజయ్, మోహన్‌లాల్ కలిసి నటించారు. ఈ సినిమా షూటింగ్‌ను డిసెంబరులో స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. వచ్చే ఏడాదికి రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ప్రసుతం వంశీ పైడిపల్లి దర్శకత్వం లోని ‘వారిస్’ సినిమా చేస్తున్నారు విజయ్. ఈ చిత్రం ఈ సంక్రాంతికి రిలీజ్ కానుంది.