అపార్థం చేసుకోవద్దు.. నేను ఐపీఎల్ చూస్తాను.. ట్రోల్స్ పై రియాక్ట్ అయిన అనిల్ రావిపూడి!

May 6, 2024

అపార్థం చేసుకోవద్దు.. నేను ఐపీఎల్ చూస్తాను.. ట్రోల్స్ పై రియాక్ట్ అయిన అనిల్ రావిపూడి!

అనిల్ రావిపూడి ఐపీఎల్ మ్యాచ్ విషయంలో ఇటీవల పెద్ద ఎత్తున ట్రోల్స్ ఎదుర్కొంటున్న సంగతి మనకు తెలిసిందే. ఈయన ఇటీవల సత్యదేవ్ హీరోగా నటించిన కృష్ణమ్మ అనే సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఐపీఎల్ ప్రస్తావనకు తీసుకువచ్చారు. ఐపీఎల్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఏ ఒకరు కూడా సినిమాలను చూడటానికి ఆసక్తి చూపించలేదని తెలిపారు. అందువల్ల కలెక్షన్స్ భారీగా తగ్గుతున్నాయని అనిల్ వెల్లడించారు.

ఐపీఎల్ చూడకపోతే కొంపలేవి మునిగిపోవు సాయంత్రం అలా థియేటర్లకు వచ్చి సినిమాలు చూడండి ఐపిఎల్ స్కోర్ మొబైల్లో అయిన చూడవచ్చు అంటూ ఈయన చేసినటువంటి కామెంట్స్ దారుణమైనటువంటి ట్రోల్స్ కి గురయ్యాయి. అనిల్ రావిపూడి ఇలాంటి కామెంట్స్ చేయడంతో నెటిజన్స్ స్పందిస్తూ ఐపీఎల్ చూడకపోతే కొంపలు మునిగిపోవు మరి సినిమాలు చూడకపోతే ఏ కొంపలు మునిగిపోతాయి అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మాకు సినిమాల కంటే ఐపిఎల్ ఏ చాలా ఇష్టం అంటూ మరికొందరు కూడా ఈ వ్యాఖ్యలపై అనిల్ రావిపూడిని ట్రోల్ చేస్తున్నారు. అయితే తాజాగా ఈ ట్రోల్స్ పై ఈయన స్పందించారు. తాను ఎలాంటి ఉద్దేశంతోనూ అనలేదని తెలిపారు. ఐపీఎల్ మ్యాచ్ వల్ల సినిమా కలెక్షన్లు తగ్గిపోయాయని ఓ డిస్ట్రిబ్యూటర్ తన వద్ద మాట్లాడటంతోనే తాను పొరపాటున అలా మాట్లాడాల్సి వచ్చిందని తాను కూడా ఐపీఎల్ మ్యాచ్ చూస్తానని తన మాటలను ఎవరు అపార్థం చేసుకోవద్దు అంటూ ఈ సందర్భంగా అనిల్ రావిపూడి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Read More: చిరంజీవి స్టాలిన్ పోస్టర్ ను కాపీ కొట్టిన ప్రశాంత్ వర్మ.. అద్భుతం సృష్టించాడుగా?

Related News

ట్రెండింగ్ వార్తలు