విలన్‌గా రామ్‌చరణ్‌.. లుక్‌ చూసి పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్‌

July 2, 2022

విలన్‌గా రామ్‌చరణ్‌.. లుక్‌ చూసి పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్‌

అవును…రామ్‌చరణ్‌ విలన్‌గా కనిపించనున్నారు. శంకర్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌ హీరోగా ఓ సినిమా రూపు దిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రామ్‌చరణ్‌ మూడు పాత్రల్లో కనిపిస్తారు. ఒకటి ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే తండ్రి పాత్ర. ఇది 1930 బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంది. మరోకటి స్టూడెంట్‌ నుంచి ఐఏఎస్‌ ఆఫీసర్‌గా ఎదిగే పాత్ర కాగా, ఇంకోటి రాజకీయనాయకుడి పాత్ర. అయితే ఈ రాజకీయనాయకుడి పాత్రలోనే రామ్‌చరణ్‌ నెగటివ్‌ షేడ్స్‌లో కనిపిస్తారు.

ప్రస్తుతం అమృత్‌సర్‌లో ఈ సినిమా షూటింగ్‌ జరుగుతోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన అమృత్‌సర్‌ షెడ్యూల్‌ షూటింగ్‌లో రామ్‌చరణ్‌ కాలేజీ బ్యాక్‌డ్రాప్‌ సన్నివేశాలను చిత్రీకరించగా, ఇప్పుటి అమృత్‌సర్‌ షెడ్యూల్‌లో రామ్‌చరణ్‌ రాజకీయనాయకుడిగా ఉన్న పాత్ర తాలుకూ సన్నివేశాలను చిత్రీక రిస్తున్నారని తెలిసింది. శ్రీకాంత్, అంజలి, సునీల్, నవీన్‌చంద్ర, జయరామ్‌ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్‌ కానుంది.

Read More: సాయిపల్లవి చేసిన తప్పే మారుతి చేశాడా?

Related News

ట్రెండింగ్ వార్తలు