August 23, 2022
నిఖిల్ సిద్దార్ద్ (Nikhil), అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలలో నటించిన ‘కార్తికేయ – 2’ (karthikeya 2) చిత్రంపై వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ (RGV) ప్రశంసల వర్షం కురిపించారు. ‘‘బాలీవుడ్ స్టార్‌హీరోలు ఆమిర్‌ఖాన్, అక్షయ్‌కుమార్ నటించిన ‘లాల్ సింగ్ చడ్డా’, ‘రక్షాబంధన్’ కంటే నిఖిల్ హీరోగా తెరకెక్కిన ‘కార్తికేయ-2’ రెండో శుక్రవారం డబుల్ కలెక్షన్లు సాధించింది. దీనిని బట్టి చూస్తుంటే.. రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్‌ఆర్‌ఆర్’,(RRR) ప్రశాంత్ నీల్ రూపొందించిన ‘కేజీయఫ్ - 2’ (KGF 2) కంటే ‘కార్తికేయ – 2’ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్. దర్శకుడు చందు మొండేటి, నిర్మాత అభిషేక్ అగర్వాల్‌కు నా అభినందనలు’’ అని వర్మ పేర్కొన్నారు.
శ్రీ కృష్ణ తత్వం, ద్వారకా నగర రహస్యం నేపథ్యంలో రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘కార్తికేయ – 2’. ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అంతటా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా 75 కోట్లకు పైగా వసూళ్లు సాధించి 100 కోట్ల మార్కుకు చేరువవుతుంది. కేవలం బాలీవుడ్‌లోనే ఇప్పటివరకూ రూ.8 కోట్లు వసూళ్లు చేసినట్లు సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ తెలిపారు. ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అనుపమ్ ఖేర్, శ్రీనివాస రెడ్డి, ప్రవీణ్, ఆదిత్యా మేనన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఇక, సుమారు ఎనిమిదేళ్ల క్రితం విడుదలైన ‘కార్తికేయ’కు ఫ్రాంచైజీగా ‘కార్తికేయ – 2’ తెరకెక్కిన విషయం తెలిసిందే.