August 23, 2022
వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ హీరోహీరోయిన్లుగా రూపొందిన చిత్రం `రంగ రంగ వైభవంగా`. గిరీశయ్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేసింది. తాజాగా ట్రైలర్‌ని రిలీజ్ చేసి సెప్టెంబరు 2 న రిలీజవుతున్న సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశారు చిత్ర యూనిట్. ట్రైలర్లో వైష్ణవ్ ఫుల్ ఓపెన్ అయి నట్టించినట్టు కనిపిస్తోంది. డైాలాగ్స్, డ్యాన్సులు, యాక్షన్లు అన్నింట్లో కుమ్మేశాడు. ట్రైలర్ మొత్తం ఎంతో ఫన్ గా నడిచింది. చిన్నతనంలో జరిగిన ఓ ఇన్సిడెంట్ వలన హీరో, హీరోయిన్లు మాట్లాడుకోవడం మానేయడం మనం చూడొచ్చు. మాట్లాడుకోనప్పటికీ ఇద్దరూ పక్కపక్క ఇళ్లల్లోనే ఉంటారు. కాలేజ్, ఫ్యామిలీ ఇలా సరదాగా సాగిపోతుంది. అనుకోకుండా హీరో ఇబ్బందుల్లో పడతాడు…ఆ తరువాత ఏం జరిగిందనేదే సినిమా. ట్రైలర్ చివర్లో హీరో ‘ఇప్పటివరకు ఒక లెక్క ఇప్పటినుంచి మరో లెక్క’ అంటూ చెప్పే డైలాగ్ హైలైట్ గా నిలిచింది. ముఖ్యంగా వైష్టవ్‌తేజ్, కేతిక శర్మ జోడి చూడముచ్చటగా ఉంది. ట్రైలర్ ఆధ్యంతం నవ్వులు పూయించింది.
కథ ప్రకారం.. హీరో హీరోయిన్లు ఇద్దరూ డాక్టర్లుగా కనిపించనున్నారు. ఈ సినిమాలో రాధాగా కేతికా శర్మ, రిషి పాత్రలో వైష్ణవ్ తేజ్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్(Devi Sri Prasad) సంగీతం అందిస్తుండగా… శ్యామ్ దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
వైష్ణవ్ తేజ్ తన మొదటి సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. ఆ తరువాత విడుదలైన ‘కొండపొలం’ సినిమా పెద్దగా ఆడలేదు. దీంతో ‘రంగ రంగ వైభవంగా’ సినిమాపైనే ఆశలన్నీ పెట్టుకున్నారు. మరి ఈ సినిమా వైష్ణవ్ రేంజ్ ని పెంచుతుందో లేదో చూడాలి!