తలపతి విజయ్ 66వ చిత్రంలో  రష్మిక మందన్న

April 6, 2022

తలపతి విజయ్ 66వ చిత్రంలో  రష్మిక మందన్న

తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉన్న తలపతి విజయ్ దర్శకుడు వంశీ పైడిపల్లితో కలిసి జాతీయ అవార్డు పొందిన‌ నిర్మాత దిల్ రాజు & శిరీష్ తమ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పై  భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. రష్మిక మందన్న ఈ చిత్రంలో విజయ్ సరసన కథానాయికగా నటించ‌నున్న‌ట్లు ర‌ష్మిక‌ పుట్టినరోజు సందర్భంగా మేక‌ర్స్ ప్రకటించారు. త్వ‌ర‌లో సెట్స్ పైకి వెళ్ళ‌నున్న ఈ చిత్రంలో  విజయ్‌ని మునుపెన్నడూ చూడని పాత్రలో ప్రెజెంట్ చేయడానికి వంశీ పైడిపల్లి పవర్‌ ఫుల్ స్క్రిప్ట్‌ను రెడీ చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన  మరిన్ని వివరాలు త్వ‌ర‌లో తెలియ‌జేయ‌నున్నారు.

ట్రెండింగ్ వార్తలు