తల్లి కాబోతున్న హీరోయిన్ రీచా చద్దా.. నెట్టింట పోస్ట్ వైరల్!

February 10, 2024

తల్లి కాబోతున్న హీరోయిన్ రీచా చద్దా.. నెట్టింట పోస్ట్ వైరల్!

బాలీవుడ్ బ్యూటీ ముద్దుగుమ్మ రిచా చద్దా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పంజాబీకి చెందిన ఈ ముద్దుగుమ్మ ఓయ్ లక్కీ.. లక్కీ ఓయ్ అనే మూవీతో సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె ఆ తర్వాత గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ సినిమాలో నటించి మరింత పాపులారిటీని సంపాదించుకుంది. ఇకపోతే రిచా చద్దా గత ఏడాది విడుదలైన ఫర్కీ 3 సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తోన్న వెబ్ సిరీస్ హీరామండిలో కీలక పాత్రలో కనిపించనుంది.

త్వరలోనే ఈ సిరీస్‌ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇకపోతే ఈమె ఫర్కీ నటుడు అలీ ఫైజల్‌తో ప్రేమాయణం కొనసాగించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రిచా చద్దా 2022లో మూడుముళ్ల బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దుగుమ్మ అభిమానులకు ఒక శుభవార్తను తెలిపింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తల్లి కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఇది చూసిన అభిమానులు ఈ జంటకు అభినందనలు తెలిపారు. కాగా 2013లో ఫర్కీ సినిమా సెట్స్‌లో మొదటిసారి కలుసుకున్న వీరిద్దరు ప్రేమలో పడ్డారు.

ఆ తర్వాత కొన్నేళ్ల పాటు డేటింగ్‌లో చేసి, ఆ తర్వాత పంజాబీ, లక్నో సంప్రదాయంలో ప్రీ-వెడ్డింగ్ వేడుకలను నిర్వహించారు. పెళ్లి తర్వాత సినీ ప్రముఖుల కోసం ముంబైలో గ్రాండ్ రిసెప్షన్‌ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ బాలీవుడ్ తారలంతా హాజరయ్యారు. ప్రస్తుతం ఒకవైపు వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తూనే మరొకవైపు వరుసగా సినిమాల్లో నటిస్తోంది. ఇక త్వరలోనే తల్లి కాబోతున్న ఈమె పిల్లలు పుట్టిన తర్వాత సినిమాలలో కంటిన్యూ అవుతుందా లేదా అనేది చూడాలి మరి.

Read More: సితార పేరుతో అలాంటి మోసాలకు పాల్పడుతున్న నేరగాళ్లు.. కేసు నమోదు?

Related News

ట్రెండింగ్ వార్తలు