ఆ హీరోనే నా రోల్ మోడల్.. యాక్టింగ్ బీస్ట్ అంటూ కామెంట్స్!

March 6, 2024

ఆ హీరోనే నా రోల్ మోడల్.. యాక్టింగ్ బీస్ట్ అంటూ కామెంట్స్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ ఉన్నటువంటి వారిలో సమంత ఒకరు. ఈమె ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. అయితే ప్రస్తుతం సమంత తన వ్యక్తిగత విషయాల కారణంగా అనారోగ్య సమస్యల కారణంగా సినిమా ఇండస్ట్రీకి కాస్త దూరమయ్యారు. ఇలా ఇండస్ట్రీకి చిన్న విరామం ప్రకటించినటువంటి సమంత త్వరలోనే తిరిగి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది.

ఇకపోతే సమంత సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఈమె ఒక కాలేజ్ ఈవెంట్ కు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా సమంత అక్కడ విద్యార్థులతో ముచ్చటిస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఈ క్రమంలోనే ఓ స్టూడెంట్ మీకు యాక్టింగ్ లో రోల్ మోడల్ ఎవరు అనే ప్రశ్న వేశారు.

ఈ ప్రశ్నకు సమంత సమాధానం చెబుతూ తనకు యాక్టింగ్ లో అల్లు అర్జున్ రోల్ మోడల్ అంటూ ఈమె సమాధానం చెప్పారు. తనతో కలిసి మరో సినిమాలో నటించాలని అనుకుంటున్నాను. ఎందుకంటే, తను ఇప్పుడు ఓ యాక్టింగ్ బీస్ట్ గా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారు అంటూ చెప్పుకొచ్చారు. ఈ విధంగా అల్లు అర్జున్ గురించి సమంత ఇలాంటి కామెంట్ చేయడంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో బన్నీ ఫాన్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక సమంత అల్లు అర్జున్ తో కలిసి ఇప్పటికే సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో నటించిన సంగతి మనకు తెలిసిందే. అంతేకాకుండా అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో ఉ అంటావా మామ అనే స్పెషల్ సాంగ్ లో అద్భుతమైనటువంటి పర్ఫామెన్స్ చేసి అందరిని ఆకట్టుకున్నారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ తో కలిసి మరోసారి నటించాలని ఉంది అంటూ ఈ సందర్భంగా సమంత కామెంట్ చేయటంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Read More: ఎన్టీఆర్ లో ఉన్న ఈ క్వాలిటీ ఏ హీరోకి లేదా.. నిజంగా గ్రేట్?

ట్రెండింగ్ వార్తలు