April 12, 2024
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత త్వరలోనే ఇండస్ట్రీలోకి తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈమె స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలోనే ఆరోగ్యపరంగా కాస్త ఇబ్బందులు ఎదుర్కోవడంతో ఈ ఇబ్బందుల నుంచి పూర్తిగా కోలుకోవడానికి చిన్న విరామం ఇచ్చారు. అయితే ఈమె తన అనారోగ్య సమస్యల నుంచి బయటపడటంతో త్వరలోనే ఇండస్ట్రీలోకి రావడానికి సిద్ధమవుతున్నారు.
ఇక త్వరలోనే సమంత అల్లు అర్జున్ అట్లీ డైరెక్షన్ లో రాబోయే సినిమాల్లో నటించబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. అలా కాకుండా రామ్ చరణ్ సుకుమార్ దర్శకత్వంలో మరో సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రంగస్థలం సినిమాకు సీక్వెల్ చిత్రం అని తెలుస్తుంది..ఈ క్రమంలోనే ఈ సినిమాలో మరోసారి సమంత నటించబోతున్నట్టు తెలుస్తుంది.
ఇక ఇదే విషయం గురించి సుకుమార్ కూడా పరోక్షంగా చెప్పకనే చెప్పేశారు. నేను సినిమాలు తీస్తూ ఉన్నన్ని రోజులు సమంత తన సినిమాలలోకి తీసుకుంటూ ఉంటానని ఈయన చెప్పిన సంగతి మనకు తెలిసిందే. తనుకు ఏ వయసు వచ్చినా ఆ వయసుకు తగ్గ పాత్ర ఇస్తూనే ఉంటాను. అంటూ భారీ ఆఫర్ ఇచ్చేశారు. దీనిపై సమంత కూడా స్పందించారు.
థాంక్యూ సుక్కూసార్.. మీరిస్తూ ఉండండి.. నేను చేస్తూనే ఉంటాను అంటూ ఆనందం వ్యక్తం చేసింది. సమంత. ఈ విధంగా సుకుమార్ గారు తాను చేసే ప్రతి సినిమాలోను ఏదో ఒక క్యారెక్టర్ లో సమంతను తీసుకుంటానని చెప్పడంతో త్వరలోనే రాబోతున్నటువంటి పుష్ప 2 సినిమాలో కూడా సమంత నటించబోతున్నారా అన్న సందేహాలు కూడా అందరికీ వ్యక్తమవుతున్నాయి. మొదటి భాగంలో స్పెషల్ సాంగ్ ద్వారా అదరగొట్టిన సమంత సీక్వెల్ సినిమాలో కూడా భాగమయ్యారా అనేది తెలియాలి అంటే మరి కొద్ది రోజులు వేచి చూడాలి. https://telugu.chitraseema.org/tollywood-comedian-sunil-was-shocked-by-rajinikanths-comments-about-pawan-kalyan/