May 20, 2022
యాంగ్రీ స్టార్ డా. రాజశేఖర్ నటించిన లేటెస్ట్ మూవీ ‘శేఖర్'(Shekar Movie). మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘జోసెఫ్’ కు రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి జీవిత రాజశేఖర్ దర్శకురాలు. మెడికల్ మాఫియా, కార్పోరేట్ సిండికేట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ రోజు విడుదలై పాజిటివ్ టాక్ అయితే సొంతం చేసుకుంది. అయితే బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఈ చిత్రం ఎంత కలెక్ట్ చేయాలో ఇప్పుడు చూద్దాం.
నైజాం : 1.2 కోట్లు సీడెడ్ : 0.50 కోట్లు ఉత్తరాంధ్ర : 0.60 కోట్లు ఈస్ట్ : 0.15 కోట్లు వెస్ట్ : 0.12 కోట్లు కృష్ణా : 0.13 కోట్లు గుంటూరు : 0.20 కోట్లు నెల్లూరు : 0.20 కోట్లు ——————————————————– ఏపి + తెలంగాణ : 3.1 కోట్లు రెస్ట్ ఆఫ్ ఇండియా+ ఓవర్సీస్ :0.15 కోట్లు ——————————————————- వరల్డ్ వైడ్ టోటల్ : 3.25 కోట్లు
‘శేఖర్’ చిత్రానికి కేవలం రూ.3.25 కోట్ల థియేట్రికల్ బిజినెస్ మాత్రమే జరిగింది. చాలా ఏరియాల్లో ఓన్ రిలీజ్ చేసుకుంటున్నారు నిర్మాతలు. అయితే ఈ సినిమా హిట్ అనిపించుకోవాలి అంటే రూ.3.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 300కి పైగా థియేటర్లలో విడుదలైంది. మొదటి రోజు కోటికి పైగా కలెక్షన్ సాధించే అవకాశం ఉంది.