ఇప్పటికీ ఆయన సలహా పాటిస్తూనే ఉన్నాను.. శ్రియ కామెంట్స్ వైరల్!

March 25, 2024

ఇప్పటికీ ఆయన సలహా పాటిస్తూనే ఉన్నాను.. శ్రియ కామెంట్స్ వైరల్!

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటి శ్రేయ శరణ్ ఒకరు. ఈమె ఒకానొక సమయంలో సౌత్ సినీ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడిపారు. తెలుగు తమిళ భాష చిత్రాలలో అగ్ర హీరోలందరి సరసన నటించి ప్రేక్షకులను మెప్పించినటువంటి శ్రేయ ఇప్పటికే పలు సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఇలా హీరోయిన్ గా కాకుండా కీలక పాత్రలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతూ ఉన్నటువంటి శ్రియా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ అందాల ప్రదర్శన చేస్తూ ప్రేక్షకులను సందడి చేస్తుంటారు. ఇకపోతే ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా కెరీర్ కి సంబంధించిన పలు విషయాలను వెల్లడించారు. నటిగా నేను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సమయంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నానని తెలియజేశారు. ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో కొనసాగలేక భయపడి పారిపోయానని ఈమె వెల్లడించారు.

ఇక నటుడు విక్రమ్ తో కలిసి కంద సామి సినిమా చేస్తున్న సమయంలో ఒక సీన్ చేయడానికి ఎన్నో టేక్స్ తీసుకున్నానని ఈమె తెలిపారు. ఆ సమయంలో విక్రమ్ చాలా ఓపికగా భరించేవారని ఆ క్షణాలను నేను ఎప్పటికీ మర్చిపోలేనని శ్రేయ తెలిపారు. ఈ షార్ట్ తర్వాత ఆయన నేను అలా చేయటం వల్ల సినిమా యూనిట్ పై ఎంత ప్రభావం పడుతుంది అనే విషయాలను ఎంతో అర్థమయ్యేలా చెప్పారు ఆ విషయాలు నన్ను నేను మార్చుకోవడానికి చాలా ఉపయోగపడ్డాయని ఈమె వెల్లడించారు.

ఇక శివాజీ సినిమా చేస్తున్న సమయంలో రజినీకాంత్ గారు నాకు ఒక సలహా ఇచ్చారు. ఆ సలహాని నేను ఇప్పటికీ పాటిస్తున్నానని తెలిపారు. ఈరోజు నువ్వు నీ అందంతో అభినయంతో నటనతో ఎన్నో విజయవంతమైనటువంటి సినిమాలలో నటిస్తున్నావు. రానున్న రోజుల్లో పరిస్థితిలో మారవచ్చు వైఫల్యాలను కూడా ఎదుర్కోవచ్చు. అయినా ప్రేక్షకులతో ఎంతో ప్రేమగా మర్యాదగా మెలగాలని ఆయన ఇచ్చినటువంటి సలహా నా ఎదుగుదలకు ఎంతగానో దోహద పడిందని ఇప్పటికి నేను ఈ సలహాని పాటిస్తున్నాను అంటూ శ్రేయ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Read More: ఎన్నికలలో పోటీ చేయబోతున్న బాలీవుడ్ ఫైర్ బ్రాండ్.. అక్కడినుంచి పోటీకి సిద్ధం!

ట్రెండింగ్ వార్తలు