Shriya Saran: నాగార్జున నాకు గొప్ప సాయం చేశారు!

March 15, 2024

Shriya Saran: నాగార్జున నాకు గొప్ప సాయం చేశారు!

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి శ్రేయ శరణ్ ఒకరు. ఈమె ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగారు. అయితే ఇప్పటికీ కూడా ఈమె ఇండస్ట్రీలో కొనసాగుతూ వరుస సినిమాలలో నటిస్తున్నారు అయితే హీరోయిన్గా కాకుండా కదా ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలలో శ్రేయ నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీ అయ్యారు.

ఇక ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో ఉన్నటువంటి స్టార్ హీరోలు అందరి సరసన నటించారు. ఇక సీనియర్ హీరోలు అయినటువంటి బాలకృష్ణ చిరంజీవి వెంకటేష్ నాగార్జున వంటి స్టార్ హీరోలు అందరి సినిమాలలో కూడా శ్రేయ నటించి ప్రేక్షకులను మెప్పించారు. అయితే ఈ హీరోలందరిలో కల్లా నాగార్జునతో ఈమె ఎక్కువ సినిమాలు చేశారు. అంతేకాకుండా వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

ఇలా వీరిద్దరి కాంబినేషన్లో సంతోషం, నేనున్నాను, ఊపిరి, మనం వంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె నాగార్జున గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. సౌత్ ఇండస్ట్రీలో నేను చాలామంది హీరోలతో నటించారు కానీ నాగార్జున గారు చాలా స్పెషల్ అని తెలిపారు.

నాగార్జున గారితో చాలా అద్భుతమైన సినిమాలు చేశానని ఈమె తెలిపారు. అయితే నాకు నిజ జీవితంలో నాకు ఒక గొప్ప సాయం చేశారని శ్రేయ తెలిపారు. ఆయన నాకు ముఖ్యంగా ధ్యానం ఎలా చేయాలో అర్థమయ్యేలా నేర్పించారు. దాని వల్ల ఇప్పటికీ నేను నా లైఫ్ లో ప్రతిరోజూ అన్ని పరిస్థితులను ఎదుర్కొగలుగుతున్నాను అంటూ నాగార్జున చేసినటువంటి ఈ సాయం గురించి ఇప్పుడు బయట పెట్టడం విశేషం. ఇక ఈమెకు పెళ్లి చేసుకొని ఒక కుమార్తెకు జన్మనిచ్చినప్పటికీ ఇంకా ఎంతో యంగ్ గా తన అందచందాలతో కుర్రకారులను కట్టిపడేస్తూ ఉంటారు అలాగే కెరియర్ పరంగా కూడా ఎంతో బిజీగా ఉన్నారు.

Read More: రాజమౌళి గారి వల్లే ఆ పద్ధతి మార్చుకున్నా… అలియా భట్ కామెంట్స్ వైరల్!

ట్రెండింగ్ వార్తలు