ఇంటెన్స్ లుక్‌లో 7జీ బృందావ‌న కాల‌ని హీరోయిన్‌

November 25, 2021

ఇంటెన్స్ లుక్‌లో 7జీ బృందావ‌న కాల‌ని హీరోయిన్‌

7 జీ బృందావ‌న కాల‌ని సినిమాతో యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది సోనియా అగ‌ర్వాల్‌. ఆ సినిమాలో ఆమె అందానికి కుర్ర‌కారు ఫిదా అయ్యారు. అయితే ఆ త‌ర్వాత స‌రైన స‌క్సెస్ రాలేదు. దాంతో టెంప‌ర్‌, రెడ్ వంటి చిత్రాల్లో చిన్న చిన్న పాత్ర‌లు చేసింది. తాజాగా సోనియా అగ‌ర్వాల్, విమ‌లా రామ‌న్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తోన్న చిత్రం ‘గ్రాండ్‌మా’. హార‌ర్ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రం ద్వారా షిజిన్‌లాల్ య‌స్‌.య‌స్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు. చార్మిళ‌, హేమంత్ మీన‌న్‌, బాల‌న‌టి పౌర్ణ‌మి రాజ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

ఈ సినిమా పోస్ట‌ర్‌ను త‌న ట్విట్ట‌ర్ హ్యాండిల్ ద్వారా సోనియా షేర్ చేశారు. ఆ పోస్ట‌ర్‌లో సోనియా చేతిలో నెత్తురు కారుతోన్న‌ క‌త్తి ప‌ట్టుకుని వుంది. బ్లాక్ క‌ల‌ర్ టంక్ టాప్‌, జీన్స్ ధ‌రించిన ఆమె న‌డుముకు కోటును ముడేసి క‌ట్టుకుంది. పోస్ట‌ర్ లో సోనియా చాలా ఇంటెన్స్‌గా క‌నిపిస్తోంది.

కేర‌ళ‌లోని కొండ ప్రాంతాల్లో ఎక్కువ శాతం షూటింగ్ జ‌రిపామ‌ని. విజువ‌ల్ ఎఫెక్ట్స్‌కు ఎక్కువ ప్రాముఖ్యం ఉంటుంద‌ని ఆద్యంతం ఒళ్లు గ‌గుర్పాటు క‌లిగించే స‌న్నివేశాల‌తో సినిమా న‌డుస్తుంద‌ని అలాగే క్లైమాక్స్‌లో సోనియా చేసే యాక్ష‌న్ సీక్వెన్స్ సినిమాకు హైలైట్ అవుతుంద‌ని చిత్ర యూనిట్ తెలిపింది.

 

Related News

ట్రెండింగ్ వార్తలు