ధమాకా వార్షిక వేడుకలకు శ్రీలీల.. అంత ఖాళీగా ఉందా?

December 26, 2023

ధమాకా వార్షిక వేడుకలకు శ్రీలీల.. అంత ఖాళీగా ఉందా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఎవరు అంటే అందరికీ టక్కున శ్రీ లీల(Sreeleela) పేరే గుర్తుకు వస్తుంది. నటిగా ఇండస్ట్రీలో వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె కనీసం తను నటించిన సినిమా ప్రమోషన్లకు రావడానికి కూడా సమయం లేకుండా ఎంతో బిజీగా షూటింగ్ పనులలో ఉండేవారు. అయితే ఇటీవల కాలంలో ఈమె నటించిన సినిమాలు వరుసగా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే ఈ సినిమాలలో కేవలం ఒక్క సినిమా మాత్రమే మంచి సక్సెస్ అందుకోగా మిగిలిన మూడు సినిమాలు తీవ్ర నిరాశ పరిచాయి.

ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి శ్రీ లీల(Sreeleela) ఇటీవల ధమాకా(Dhamaka) రిలీజ్ వార్షికోత్సవ వేడుకలలో పాల్గొన్నారు. రవితేజ శ్రీ లీల హీరో హీరోయిన్లుగా నటించినటువంటి ఈ సినిమా విడుదలయ్యి ఏడాది పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఈగల్ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈ సినిమా వార్షికోత్సవ వేడుకను కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ లీల సందడి చేయడం విశేషం.

ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలు వైరల్ గా మారడంతో ఎంతో మంది శ్రీలీల పట్ల చేస్తున్నటువంటి కామెంట్లు వైరల్ అవుతున్నాయి. అదేంటి శ్రీ లీల తన సినిమా పనులతో బిజీగా ఉండటం వల్ల ఈమె నటించిన సినిమా ప్రమోషన్లకు కూడా హాజరు కాలేదు అలాంటిది ధమాకా సినిమా వార్షికోత్సవ వేడుకలకు హాజరయ్యారా అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఇలా ఈ సినిమా వార్షికోత్సవ వేడుకకు ఈమె హాజరయ్యారు అంటే శ్రీ లీలకు సినిమాలు లేవా ఖాళీగా ఉండటం వల్లే ఈ వేడుకకు హాజరయ్యారా అంటూ సందేహాలను వ్యక్తపరుస్తున్నారు.

Read More: మగాళ్లంటే పిచ్చి.. పేమెంట్‌ను బట్టి పర్ఫామెన్స్.. రెచ్చిపోయిన యాంకర్ రష్మి

ట్రెండింగ్ వార్తలు