July 2, 2022
Sri Vishnu Alluri First Look: ఒక వ్యక్తి జీవితం ఆధారంగా తీసిన సినిమాను ఇండస్ట్రీలో బయోపిక్‌గా చెప్పుకుంటారు. ఎన్టీఆర్ బయోపిక్ ‘కథానాయకుడు’, ‘మహానాయకుడు’గా వచ్చింది. సావిత్రి బయోపిక్ ‘మహానటి’గా వచ్చింది…ఇలా రీసెం ట్ టైమ్స్‌లో చాలా బయోపిక్స్ వచ్చాయి. సెట్స్‌పై చాలానే ఉన్నాయి. కానీ ఇప్పుడు కొత్తగా బయోపిక్ కాదు..బయోఫిక్షన్ అనే ట్రెండ్ నడుస్తోంది ఇండస్ట్రీలో.
అంటే ఓ వ్యక్తి జీవితంలోని సంఘటనల ఆధారం గానే సినిమా తీస్తారు. కానీ కల్పితం ఎక్కువగా ఉంటుంది అదే బయోఫిక్షన్ కావొచ్చు బహుశా. రీసెంట్‌గా కొండా మురళి, కొండా సురేఖల జీవితం ఆధారంగా రామ్‌గోపాల్ వర్మ ‘కొండా’ అనే సినిమా తీశాడు. ఈ చిత్రంలో కొండా మురళిగా నటించిన త్రిగుణ్ ‘కొండా’ను బయోఫిక్షన్‌గానే చెప్పుకున్నాడు.
Read Also: నాని దసరా బడ్జెట్ సమస్య తీరినట్లేనా!ఇప్పుడు శ్రీ విష్ణు హీరోగా ‘అల్లూరి’ అనే సినిమా వస్తోంది. ఇదీ కూడా బయోఫిక్షనే అట. పోలీసాఫీసర్ పాత్రలోనటించారు శ్రీ విష్ణు. ఈ సినిమా ఫస్ట్‌లుక్(Sri Vishnu Alluri First Look)ను కూడా రిలీజ్ చేశారు. పాట మినహా షూటింగ్ పూర్తయింది. ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్ అవుతుంది. బెక్కెం వేణుగోపాల్ ఈ సినిమాకు నిర్మాత. ప్రదీప్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక ‘అల్లూరి’ తర్వాత దర్శకుడు హసిత్ గోలితో సినిమా చేస్తారు శ్రీ విష్ణు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘రాజ రాజ చోర’ మంచి హిట్ సాధించిన సంగతి తెలిసిందే. మరో విశేషం ఏంటంటే.. ఈ చిత్రంలో శ్రీ విష్ణు త్రిపాత్రా భినయం చేస్తున్నారు.