దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న సుకుమార్ డాటర్ సుకృతి!

May 2, 2024

దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న సుకుమార్ డాటర్ సుకృతి!

ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె సుకృతి అరుదైన అవార్డుకు ఎంపిక అయ్యారు. ఈమె ఇటీవల దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపిక కావడంతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఈమె పై ప్రశంసల వర్షం కురిపించింది. సుకుమార్ డైరెక్టర్గా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంత మంచి సక్సెస్ అందుకున్నారు అయితే ఈయన కుమార్తె సుకృతి వేణి బండ్రెడ్డి బాలనటిగా గాంధీ తాత చెట్టు అనే సినిమాలో నటించారు.

ఈ సినిమాలో బాలనటిగా నటించినటువంటి సుకృతి తన నటనకు గాను ఏకంగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీలో మంగళవారం జరిగినటువంటి అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమాలలో భాగంగా సుకృతి ఈ అవార్డును అందుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది టాలీవుడ్ సినీ సెలబ్రిటీలు సుకృతికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ప్ర‌స్తుతం ఇంట‌ర్నేష‌న‌ల్ స్కూల్ ఆఫ్ హైద‌రాబాద్‌లో గ్రేడ్ 8 అభ్య‌సిస్తున్న సుకృతి వేణి బండ్రెడ్డి న‌టించిన ఈ చిత్రం గ‌తంలో కూడా ప‌లు ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో ప్ర‌ద‌ర్శింప‌బ‌డింది. ఈ సినిమా ద్వారా తన నటనకు ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకోవడమే కాకుండా ఎన్నో రకాల అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు.. ఇలా ఇంత చిన్న వయసులోనే సుకృతి ఇలాంటి అవార్డులను అందుకోవడంతో సుకుమార్ తో పాటు తన భార్య తబిత యుద్ధ సంతోషం వ్యక్తం చేశారు.

ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ ముఖ్య ఉద్దేశ్యంగా తెర‌కెక్కిన ఈ సందేశాత్మ‌క చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు మైత్రీ మూవీ మేక‌ర్స్, సుకుమార్ రైటింగ్స్‌తో పాటు గోపీ టాకీస్ సంస్థ‌లు నిర్మించాయి. న‌వీన్ ఎర్నేని, వై.ర‌విశంక‌ర్‌, శేష సింధు రావులు నిర్మాత‌లు. ప‌ద్మావ‌తి మ‌ల్లాది ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ మూవీకి త‌బితా సుకుమార్ సమర్పకురాలిగా వ్యవహరించారు.

Read More: పుష్ప 2 సాంగులో గాజు గ్లాస్ చేత పట్టిన బన్నీ… పవన్ కు ఇలా ప్రచారం చేస్తున్నారా?

Related News

ట్రెండింగ్ వార్తలు