May 2, 2024
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ త్వరలోనే పుష్ప 2సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నడుమ విడుదల కానుంది ఆగస్టు 15వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇకపోతే తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే.
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా ఎంతో మంచి సక్సెస్ అయింది ఈ సినిమాలో అల్లు అర్జున్ మ్యానరిజానికి అందరూ ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమా సక్సెస్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రంగా పుష్ప 2 సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు. ఇకపోతే ఇటీవల విడుదల చేసినటువంటి పుష్ప పుష్ప అనే టైటిల్ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.
ఇక ఈ పాటకు అల్లు అర్జున్ వేసినటువంటి స్టెప్పులు దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చినటువంటి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ భారీ స్థాయిలో అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇకపోతే ఈ సినిమాలో అల్లు అర్జున్ స్టెప్పులు వేసే చోట ఓ సన్నివేషంలో చేతిలో గ్లాస్ లో టీ పట్టుకొని కనిపించారు. ఇలా గాజు గ్లాసు పట్టుకొని ఉండడంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో హైలెట్ గా మారింది.
అల్లు అర్జున్ ఇలా గాజు గ్లాస్ లో టీ తాగుతూ కనిపిస్తూ ఉండటం జనసేన పార్టీకి మద్దతుగా నిలబడ్డారని తెలుస్తుంది. ఈ విధంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్నారు. అయితే ఈయన పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే మెగా హీరోలందరూ కూడా పిఠాపురం చేరుకొని ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే బన్నీ సైతం ఇలా జనసేన ప్రచారాలను నిర్వహిస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో ఈ విషయాన్ని వైరల్ చేస్తున్నారు.
Read More: ఎన్టీఆర్ నాకు మిత్రుడు కాదు.. వారిద్దరి నా స్నేహితులు.. రాజమౌళి కామెంట్స్ వైరల్!