ప్రియుడిని పెళ్లాడబోతున్న తాప్సీ… పెళ్లెప్పుడంటే?

February 28, 2024

ప్రియుడిని పెళ్లాడబోతున్న తాప్సీ… పెళ్లెప్పుడంటే?

ఇటీవల కాలంలో సినిమా సెలబ్రిటీలందరూ కూడా ఒక్కొక్కరుగా పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల రకుల్ ప్రీతి సింగ్ నటుడు జాకీ భగ్నానీను గోవాలో ఎంతో ఘనంగా పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా వీరి వివాహం కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో ఎంతో ఘనంగా జరిగింది. ఇలా ఈమె పెళ్లి జరిగిన కొద్ది రోజులకే మరో ముద్దుగుమ్మ పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధమైంది.

ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి తాప్సీ ఒకరు. ఈమె కూడా త్వరలోనే తన ప్రియుడుతో కలిసి పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. తాప్సీ గత కొన్ని సంవత్సరాలుగా డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియస్ బోయ్‍ని ప్రేమిస్తున్నారు. ఇలా కొంతకాలంలో ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని తెలుస్తుంది. ఇక వీరి వివాహం ఉదయపూర్ లో ఎంతో ఘనంగా జరగబోతుందని సమాచారం.

తాప్సీ మాథియాస్ వివాహం రాజస్థాన్లోని ఉదయపూర్ కోటలో ఎంతో ఘనంగా మార్చి నెలాకరులో జరగబోతుందని తెలుస్తుంది. ఈ పెళ్లి వేడుకకు బాలీవుడ్ నుంచి పలువురు సినీ సెలబ్రిటీలు అత్యంత సన్నిహితులు కుటుంబ సభ్యులు మాత్రమే హాజరు కాబోతున్నారని సమాచారం. ఇక వీరి వివాహం సిక్కు, క్రిస్టియన్ సాంప్రదాయాల ప్రకారం జరగబోతుందని తెలుస్తోంది. అయితే వీరి పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పటికీ తాప్సీ నుంచి ఏ విధమైనటువంటి సమాచారం మాత్రం వెలబడలేదు.

ఇక తాప్సీ తెలుగు చిత్ర పరిశ్రమకు ఝుమ్మంది నాదం అనే సినిమా ద్వారా హీరోయిన్గా పరిచయమయ్యారు. కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చినటువంటి ఈ సినిమాలో మంచు మనోజ్ హీరోగా నటించారు. ఇలా పలు తెలుగు సినిమాలలో నటించినటువంటి ఈమె అనంతరం బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్లారు. బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఛష్మీ బద్దూర్ అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చారు. ఇటీవల షారుఖ్ ఖాన్ తో కలిసి ఈమె డుంకి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

Read More: పోచర్ సిరీస్ పై మహేష్ బాబు ఎమోషనల్ కామెంట్స్!

ట్రెండింగ్ వార్తలు