April 15, 2024
టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు హీరోయిన్, తాప్సీ పన్ను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు తెలుగులో పలు సినిమాలలో నటించి హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న తాప్సీ తెలుగులో దరువు, మొగుడు, మిషన్ ఇంపాజిబుల్, వస్తాడు నా రాజు, ఝుమ్మంది నాదం, షాడో నీవెవరో, ఆడు కలం, సాహసం లాంటి సినిమాలలో నటించి మెప్పించింది. అలాగే తాప్సీ కేవలం తెలుగులో మాత్రమే కాకుండా హిందీ, తమిళ సినిమాలలో కూడా నటించి మెప్పించింది. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరంగా ఉంటోంది.
ఆ సంగతి పక్కన పెడితే ఇటీవల కాలంలో తాప్సి తరచూ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉంది. ముఖ్యంగా ప్రేమ పెళ్లి బాయ్ ఫ్రెండ్ ఈ విషయాలలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. అయితే ఇప్పటికే పలుసార్లు తన పెళ్ళి గురించి నెటిజన్లకు షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది. ఇక రీసెంట్ గా ప్రేమించిన ఫారెన్ ప్రియుడిని పెళ్ళాడిన తాప్సీ తన పెళ్ళి గురించి ఎందుకు సమాచారం ఇవ్వలేదో కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేసింది. డెన్మార్క్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మథియాస్ బోను ఆమె పెళ్లాడారు. మార్చి 23న ఉదయ్ పూర్ లో వీరి వివాహం ఘనంగా జరిగినట్టు తెలుస్తోంది. ఇక రీసెంట్ గా జరిగిన ఇంటర్వ్యూలో తన సీక్రేట్ మ్యారేజ్ గురించి వెళ్ళడించారు తాప్సీ.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పెళ్లి తమ వ్యక్తిగత వ్యవహారం. పెళ్లికి సంబంధించిన విషయాలను వెల్లడిస్తూ అందరిలో ఆసక్తిని పెంచాలని నేను కాని నా భర్త కాని అనుకోలేదు. అంతే కాదు పెళ్ళి అనేది మా పర్సనల్ దాని గురించి అందరూ చర్చించుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకే సోషల్ మీడియాలో కూడా దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించలేదు అంటూ కాస్త ఘాటుగా రియాక్ట్ అయ్యింది తాప్సీ. అలాగే పెళ్లి చేసుకున్న విషయాన్ని ఎప్పటికీ రహస్యంగా ఉంచాలనే ఉద్దేశం కూడా మాకు లేదు అని చెప్పుకొచ్చింది తాప్సీ..
Read More: చిరంజీవి కలిసి టాలీవుడ్ డైరెక్టర్స్.. ఎందుకో తెలుసా?